Home Tollywood లక్ కోసం....పేరు మార్చుకున్న మెగా హీరో

లక్ కోసం….పేరు మార్చుకున్న మెగా హీరో

సినిమా పరిశ్రమలో సెంటిమెంట్స్ ఎక్కువ. హిట్ వచ్చినా అందుకు కారణమైన సెంటిమెంట్ కారణం వెతుకుతారు. ప్లాఫ్ వచ్చినా అందుకు కారణం అంటూ మరో సెంటిమెంట్ ని నమ్ముతారు. అప్పటిదాకా వెలిగిన వారు కూడా కొద్దిగా వెనకబడేసరికి ఏం చేయాలో తోచక రకరకాల సెంటిమెంట్స్ ని ఆశ్రయిస్తారు. అందులో ముఖ్యంగా న్యూమరాలిజీ అనేది సినిమావాళ్లు బాగా నమ్మేది.

దాన్ని నమ్మి తమ పేరుని మార్చుకుంటారు. అలా మార్చుకున్నవాళ్లు మళ్లీ ఫామ్ లోకి వచ్చిన వాళ్లు ఉన్నారు. మార్చినా జీవితంలో మార్పు రాక అలా మిగిలిపోయిన వాళ్లు ఉన్నారు. ఇప్పుడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ పరిస్దితి అదే.

Sai Tej | Telugu Rajyam

వరస పెట్టి ఆరు ఫ్లాప్‌ లు రావటంతో సాయి ధరమ్‌ తేజ్‌ తన పేరును మార్చుకున్నాడు. రీసెంట్ గా రిలీజ్‌ అయిన చిత్రలహరిలోని పరుగు పరుగు పాట లిరికల్‌ వీడియోలో సాయి ధరమ్‌ తేజ్‌ పేరును సాయి తేజ్‌ అని వేయటం గమనించవచ్చు. సినిమాలో కూడా టైటిల్స్‌లో ఇదే పేరు పడుతుందన్న మెగాభిమానులు అంటున్నారు . ఈ సినిమా హిట్ అయితే ఖచ్చితంగా ఈ సెంటిమెంట్ ని నమ్ముతాడు అనటంలో సందేహం లేదు.

ప్రస్తుతం చిత్రలహరి సినిమాలో నటిస్తున్న సాయి సక్సెస్‌ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. సాయిధరమ్‌తేజ్, కల్యాణీ ప్రియదర్శన్, నివేదా పేతురాజ్‌ హీరోహీరోయిన్లుగా, ‘నేను శైలజా’ ఫేమ్‌ కిషోర్‌ తిరుమల తెరకెక్కించిన చిత్రం ‘చిత్రలహరి’. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, మోహన్‌ చెరుకూరి, రవి శంకర్‌ నిర్మించారు. ఏప్రిల్‌ 12న విడుదల కానున్న ఈ చిత్రానికి సుకుమార్ వాయిస్ ఓవర్ ఇచ్చారు.

- Advertisement -

Related Posts

కనిపించేంత సులువు కాదట.. ప్రాక్టీస్ సెషన్‌లొ ఆండ్రియా

సినిమాలోని పాత్రల కోసం కొంత మంది విపరీతంగా కష్టపడుతుంటారు. అలా పాత్రల కోసంప్రాణం పెట్టేవారికి మంచి క్యారెక్టర్స్ పడుతుంటాయి. హీరోయిన్లు గ్లామర్ పాత్రలకే పరిమితమైతే నటించేందుకు స్కోప్ ఉండే పాత్రలు అంతగా రావు....

అమ్మ బాబోయ్ త్రివిక్రమ్‌తో భారీ స్కెచ్ వేశారే.. పాపం మధ్యలో ఆ డైరెక్టర్ బక్రానా?

రీమేక్ సినిమాలను తెరకెక్కించడం అంత చిన్న విషయమేమీ కాదు. మన ప్రాంతం, పద్దతులు, జీవిన విధానం ఇలా అన్నింటికి సరిపడా మార్పులు చేర్పులు చేసుకోవాలి. కథలో మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడి జనాలను...

ఇది మామూలు క్రేజ్ కాదు.. అభిజిత్‌కు రోహిత్ శర్మ గిఫ్ట్

అభిజిత్‌కు ప్రస్తుతం ఎంతటి ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. అతని మెచ్యూరిటీ, స్టార్ట్ నెస్, కూల్ నెస్, మాట్లాడే విధానం ఇలా ప్రతీ ఒక్కటి అందరినీ కట్టిపడేసింది. మామూలు జనాలనే కాకుండా.. సెలెబ్రిటీలను...

‘ఉప్పెన’ వచ్చేది ఎప్పుడంటే?

కరోనా లాక్ డౌన్ కారణంగా ఒక్కసారిగా వాయిదా పడిన సినిమాల్లో ఉప్పెన ఒకటి. మెగా హీరో వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై ఓ వర్గం ఆడియెన్స్ లో అయితే...

Latest News