సాహో: చుంకీ పాండే పోస్టర్ విడుదల

సాహో ఫీవర్ మొదలైంది. ప్రచారంతో హోరెత్తిస్తున్నారు నిర్మాతలు. సినిమాలో ఒక్కో పాత్రనూ పరిచయం చేస్తూ పోస్టర్లు విడుదల చేస్తూ సినిమా పై మరింత ఆసక్తిని పెంచుతున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ నటుడు చుంకీ పాండే పోస్టర్ ను విడుదల చేశారు.

అందులో చాలా స్టైల్ గా కోట్ వేసుకుని కనిపిస్తున్నాడీయన. మరి సినిమాలో తనలోని ఏ కోణం చూపిస్తారో చూద్దాం. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 30 న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే