Daughter’s Vulgar Dressing : ముద్దుగుమ్మల హాట్ హాట్ డ్రెస్సింగ్ విషయంలో ఎప్పటికప్పుడే హాట్ హాట్ డిస్కషన్స్ జరుగుతూ వుంటాయ్. నెట్టింట ట్రోల్స్ జరుగుతుంటాయ్. కొన్ని అభ్యంతరకరం కావచ్చు. మరికొన్ని లైట్ తీసుకునేలా వుండొచ్చు.
తాజాగా అలాంటి ట్రోల్స్ ఎదుర్కొంటోంది బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే. బాలీవుడ్ స్టార్ చుంకీ పాండే కుమార్తె అయిన అనన్యా పాండే తాజాగా ఓ పార్టీ కోసం పార్టీ వేర్‌లో మెరిసింది. ఆగండాగండీ అది పార్టీ వేర్ అనచ్చో లేదో. జస్ట్ లైక్ ఏ బికినీ అనాలేమో. నెటిజన్లకు ఆ డ్రెస్‌లో ఓ రేంజ్ వల్గారిటీ కనిపించింది మరి. ఊరుకుంటారా.?
ఊ ఊ అన్నారు. తమ చేతులకు పని పెట్టారు. నెట్టింట వరుసపెట్టి ట్రోల్స్ మొదలెట్టారు. ఆ నోటా ఈ నోటా తండ్రి చుంకీ పాండే వద్దకు ఈ విషయం చేరగా, ‘నా కూతురు ఎప్పుడూ వల్గర్‌గా డ్రస్ చేసుకోదు. గ్లామర్ ప్రపంచంలో వున్నప్పుడు అలాంటి డ్రస్ వేర్ సహజం..’ అన్నట్లుగా లైట్ తీసుకున్నారు.
గతంలో మరో బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కూడా తన కూతురు సోనమ్ కపూర్ విషయంలో ఇలాగే స్పందించాడు. ఓ పార్టీ సందర్భంగా తండ్రీ కూతుళ్లు దిగిన ఫోటోలు చాలా జుగుప్ప కలిగించేలా ఉన్నాయంటూ నెటిజన్లు ఆడిపోసుకున్నారు. ఆ ట్రోల్స్‌ని ఆయనా అలాగే లైట్ తీసుకున్నారు.
తెలుగులోనూ స్టార్ కిడ్స్ వున్నారు. కమల్ హాసన్ తనయ శృతిహాసన్ కూడా ఒకానొక టైమ్‌లో ఇలాంటి ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎంత గ్లామర్ ప్రపంచం అయితే మాత్రం మరీ ఇంత దిగజారిపోవాలని లేదు కదా.. అనేది నెటిజన్ల అభిప్రాయం కావచ్చుగా.