“ఆర్ఎక్స్ 100”  డైరక్టర్ నెక్ట్స్ ఆ హీరో తో ఫైనల్ ?

ఈ మధ్య కాలంలో ఎలాంటి ఎక్సపెక్టేషన్స్  లేకుండా వచ్చి ఘన విజయం సాధించి మంచి వసూళ్లు సాధించిన చిత్రం “ఆర్ఎక్స్ 100”. అంతా కొత్తవాళ్ళతోనే వచ్చిన ఈ సినిమా విజయంతో అందరి దృష్టీ ఈ చిత్ర దర్శకుడుఅజయ్ భూపతిపై పడింది. ప్రముఖదర్శకు రామ్ గోపాల్ వర్మ దగ్గర పనిచేసిన ఈ దర్శకుడుతో సినిమా చెయ్యటానికి హీరోలు ఉత్సాహం చూపిస్తున్నారు. ముఖ్యంగా ప్లాఫ్ ల్లో ఉండి తమని ఎవరైనా ఒడ్డున పడేస్తారని ఎదురుచూస్తున్న నితిన్, రామ్ ఈ డైరక్టర్ తో ముందుకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

అందుకేనేమో ఈ హీరోలిద్దరూ రీసెంట్ గా జరిగిన ఈ దర్శకుడు వివాహానికి హాజరయ్యారు. అయితే ఈ హీరోలిద్దరిలో రామ్ ఇంకొంచెం స్పీడ్ అయ్యారట. అజయ్ భూపతి చెప్పిన కథ విని ముందుకు వెళ్దామని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దాంతో రామ్ తో సినిమా చెయ్యటానికి అజయ్ భూపతి స్క్రిప్టుని ఇప్పటికే రెడీ చేస్తున్నారు. ఆ సినిమాలో మహానటిలో నటించిన దుల్కర్ సల్మాన్ కూడా ఓ హీరోగా చేసే అవకాసం ఉందంటున్నారు.

అయితే రామ్ ..గతంలోనూ వరసగా డైరక్టర్స్ ని పిలిచి సినిమాలు ఓకే చేయటం, ఆ తర్వాత కొంత జర్నీ జరిగాక రకరకాల కారణాలతో నో చెప్పటం జరుగుతూ వస్తోంది. మరి ఈ దర్శకుడుతో అయినా చివరి దాకా ముందుకు వెళ్తాడని ఆశిద్దాం.