(ధ్యాన్)
వాళ్ల బండి వేలానికొచ్చింకొన్ని సినిమాలు ఎందుకు ఆడుతాయో అర్థం కాదు. అందరూ ఆరాధించే అమ్మాయిలను మోసం చేస్తేనో, వాళ్లే మోసం చేసినట్టు చూపించేస్తేనో.. ఆలోచించకుండా జనాలు ఆదరించేస్తారు. ఇటీవల విడుదలైన `ఆర్ ఎక్స్ 100` అలాంటి సినిమానే. అబ్బాయి శరీరాన్ని చూసి మోజుపడి కోరికను తీర్చుకుని తన దారి తాను చూసుకున్న అమ్మాయి కథతో ఈ సినిమాను రూపొందించారు. యూత్‌లో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆర్ ఎక్స్ 100లాగా యారొగెంట్‌గా బిహేవ్ చేసే కుర్రాడి కథ అని చూచాయగా చెప్పడం కోసం ఈ సినిమాకు అదే పేరును ఉంచారు. చిత్రంలో ఓ ఆర్ ఎక్స్ 100 బైక్‌ని కూడా తగలబెట్టారు. ఆ సీన్‌ని చూసిన వారంతా ఇప్పుడు `ఆ బైకే దొరక్కపోతుంటే అన్యాయంగా తగలబెట్టుదేందీ` అని కూడా అనుకున్నారు. అయితే తగలబెట్టింది డమ్మీనే. వాళ్ల దగ్గర ఒరిజినల్ కంటెంట్ అలాగే ఉంది.అదే ఒరిజినల్ బైక్ అలాగే ఉంది. ఇప్పుడు ఆ బైక్‌ని వేలం వేస్తున్నారు. ఆ డబ్బును కేరళ వరద బాధితుల కోసం వాడనున్నారు. మినిమమ్ రూ.50వేలకు బిడ్ వేయాలని వాళ్లు సూచించారు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు సంప్రదించవచ్చు.