ఈ మధ్యకాలంలో మీడియాలో, సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చించబడ్డ అంశం ప్రణయ్ హత్య. ప్రణయ్ అమృతను ప్రేమించి పెళ్లి చేసుకోవటం…అయితే, ఇది కులాంతర వివాహం కావడం, ప్రణయ్ దళితుడు కావడంతో అమృత తండ్రి మారుతీరావు అంత్యంత కిరాతకంగా ప్రణయ్‌ను పట్టపగలు నడిరోడ్డుమీద చంపించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేపింది. ఈ ఘటన అనంతరం ప్రేమవివాహం చేసుకున్న జంటలపై జరుగుతున్న దారుణాలు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి.
ఈ నేపధ్యంలో ఆర్ ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి మీడియాతో మాట్లాడారు. పెద్దలను ఒప్పించే ధైర్యమున్న వారే ప్రేమించాలని, లేదంటే, ప్రేమకు దూరంగా ఉండాలని ఆర్‌ఎక్స్ 100 సినిమా డైరెక్టర్ అజయ్ భూపతి సూచించారు. ఆ స్పందనపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. కొందరు ఆయన్ను సపోర్ట్ చేస్తే మరికొందరు అలా మాట్లాడటం సరికాదంటున్నారు.
అజయ్ భూపతి మీడయాతో మాట్లాడుతూ..జీవితంలో స్థిరపడినా జంటను ఎవరూ విడదీయలేరన్నారు. తాను కూడా ప్రేమ పెళ్లి చేసుకున్నానని ..డైరెక్టర్‌గా రాణించాలన్నది తన లక్ష్యమన్నారు.. ఆ గోల్ రీచ్ అయ్యాకే లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నానని చెప్పారు. ప్రణయ్ గోల్ సాధించి,భార్యతోపాటు దూరంగా వెళ్లి జీవిస్తే బాగుండేదని అజయ్ భూపతి వివరించారు.