RRR Pre- Release Event: బ్లాస్టింగ్ ఈవెంటుకి టాలీవుడ్ డాషింగ్ డైనమెట్స్.. ఇక బొమ్మ దద్దరిల్సిందే..

RRR Pre- Release Event: సమయం లేదు మిత్రమా.. ఇంకో రెండువారాలు మాత్రమే మిగిలింది. జనవరి 7న మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీ వెండితెర మీదకు ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శితం కానున్నది. ఎన్ని థియేటర్లలో విడుదల చేసిన మొదటి వారం టికెట్లు దొరుకుతాయో లేదో అన్న సందేహం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ సినిమా టికెట్లు హాట్ కేకుల్లా అమ్మడుకుపోయాయి. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఏ సినిమాకి లేనంత స్థాయిలో భారీ అంచనాలు ఈ సినిమా విడుదల కాకముందే నెలకొన్నాయి. మీరు ఎన్ని అంచనాలైనా పెట్టుకోండి.. అంతకు మించే ఈ సినిమా ఉంటుందని చిత్రబృందం ఈ అంచనాలను ఇంకా ఇంకా పెంచుస్తూనే ఉంది.

ఇప్పటికే ప్రీ రిలీజ్ వేడుకలతో ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ ని మొదలు పెట్టిన మూవీ టీం మహానగరం ముంబైలో కనీవినీ ఎరుగని రీతిలో అంగరంగ వైభవంగా ఏ తెలుగు సినిమాకి జరగని విధంగా ప్రీరిలీజ్ వేడుకని ఘనంగా నిర్వహించారు. అయితే అతి త్వరలోనే హైదరాబాదులో మరో ఈవెంట్ ప్లాన్ చేసిన నిర్వాహకులు ఇప్పటికే దీనికోసం ఏర్పాట్లు కూడా ముమ్మరంగా మొదలు పెట్టారు. ముంబైలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంటుకి బాలీవుడ్ బాద్షా, కండలవీరుడు సల్మాన్ ఖాన్, స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ హాజరుకాగా హైదరాబాద్ ఈవెంట్ కి ఎవరు హాజరవుతారనేది ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఇద్దరు టాలీవుడ్ టాప్ స్టార్స్ రాబోతున్నారని సమాచారం.

ఇప్పుడున్న టాలీవుడ్ సీనియర్ హీరోలలో టాప్ హీరోస్ ఎవరంటే టక్కున గుర్తొచ్చే మొదటిపేరు మెగాస్టార్ చిరంజీవి.. అందులో నో డౌట్. తరువాత గుర్తొచ్చేది నందమూరి నటసింహం బాలకృష్ణ పేరు. వీరిద్దరూ ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంటుకి హాజరు కాబోతున్నారని టాక్ నడుస్తుంది. మరి ఈ వార్త ఎంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది. ఈరోజు లేదా రేపు అధికార ప్రకటన రాబోతున్నట్లు చెప్తున్నారు. ఇది గనుక నిజమైతే అభిమానులకి కన్నుల పండగే. రెండు తరాల నుండి రెండు కుటుంబాల హీరోలు ఒకే వేదికపై కనువిందుగా కనిపిస్తే అది అభిమానులకి వెలకట్టలేని ఆనందం మరి. ఇది ఎంతవరకు నిజమన్నది అని ఎదురుచూడాల్సి ఉంది.