టాక్ : ‘RRR’ రెండో సాంగ్ ఇలా ఉండబోతుందా.?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలాగే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో రాజమౌళి తీసిన బిగ్గెస్ట్ విజువల్ ట్రీట్ ట్రిపుల్ ఆర్(RRR). తారా స్థాయి అంచనాలు నెలకొల్పుకున్న ఈ సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన గ్లింప్స్ కి భారీ స్థాయి రెస్పాన్స్ ఆల్ ఓవర్ ఇండియా వచ్చింది. పైగా రాజమౌళి నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్స్ ఈ సినిమాకి ప్లాన్ చేస్తుండడంతో మరింత ఆసక్తి దీనిపై నెలకొంది.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి రెండో పాటపై కూడా చిత్ర యూనిట్ అప్డేట్ ఇవ్వగా అదెలా ఉంటుందా అని టాక్ మొదలయ్యింది. కానీ ఇది ఎలా ఉంటుందా అనేదానిపై ఇంట్రెస్టింగ్ టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఈసారి మాత్రం పక్కా మాస్ నెంబర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేయనున్నారట.

కీరవాణి ఈ సాంగ్ ని పాన్ ఇండియన్ లెవెల్లో రీచ్ అయ్యే విధంగా తీర్చి దిద్దినట్టు తెలుస్తుంది. అలాగే ఇద్దరి హీరోల పాత్రలపైనే ఇది కూడా ఉండొచ్చని ఇంకో రూమర్ ఉంది. మరి ఇది ఎంతమేర నిజమో ఎదురు చూడాలి.