మెగాస్టార్ చిరంజీవి, రోజా కాంబో అంటే సిల్వర్ స్క్రీన్‌పై విజిల్స్ మోత మోగాల్సిందే. ఈ ఇద్దరు కలిసి పాటలకు స్టెప్పులు వేశారంటే మాస్, క్లాస్ ఆడియెన్స్ ఊగిపోవాల్సిందే. అయితే చిరంజీవి సినిమాలో రోజా మొదటగా చేసింది ముఠామేస్రీ. అందులోనూ ఫస్ట్ డే షూటింగ్‌లోనే పాట మీద షూట్ ప్లాన్ చేశారట. ఆ రోజు జరిగిన సంఘటనలు, ఆ సినిమా విశేషాలను తాజాగా రోజా వెల్లడించింది.

2020 అనుకున్నది ఒకటి అయినది ఒకటి ఈవెంట్‌లో చిరు బర్త్ డే వేడకులను ఘనంగా నిర్వహించారు. అందులో భాగాంగా రోజా మాట్లాడుతూ.. ముఠామేస్త్రీ సినిమా షూటింగ్ విశేషాలను చెప్పుకొచ్చింది. చిరంజీవితో కలిసి డ్యాన్సులు చేయడం చాలా కష్టం, జాగ్రత్తగా వ్యవహరించమని సెట్‌లో అందరూ భయపెట్టారట. అయితే అలా చిరంజీవి గారు ఎంట్రీ ఇచ్చారు.. ఎంతో సింపుల్‌గా వచ్చి మాట్లాడారట. మొదటి రోజే ఎంత ఘాటు ప్రేమయో అనే పాట షూట్ చేశారట.
ఇక అదే సినిమాలో మామా మామా అనే మాస్ పాట అదిరిపోయిందని, ఆ పాట షూటింగ్ సమయంలో చిరంజీవి దీక్షలో ఉన్నారట. అందుకే రొమాంటిక్ స్టెప్స్, ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడానికి చిరంజీవి ఇబ్బంది పడ్డారట. ఇక అదే చాన్స్ అనుకుని రోజా రెచ్చిపోయి డ్యాన్సులు వేసిందట. పైగా రిహాల్సల్‌లో ఒకలా, కెమెరా ముందు మరోలా చేసేదాన్ని, అలా చిరంజీవిని మోసం చేసేదాన్ని అని చెప్పుకొచ్చింది. ఆ తరువాత ఆ మోసాన్ని చిరు పసిగట్టి.. ఈ అమ్మాయితో జాగ్రత్తగా ఉండాలని అన్నారట.
