ఆరోజు సుశాంత్ సింగ్ ప్రియురాలు ఫోన్ స్విచ్ఛాఫ్
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బలవన్మరణం తర్వాత రకరకాల ట్విస్టులు ఒక్కొక్కటి రక్తి కట్టిస్తున్నాయి. ఈ కేసులో ప్రియురాలు రియా చక్రవర్తిని తొలి నుంచి అభిమానులు టార్గెట్ చేస్తున్నారు. రియా వెనక మాఫియా పెద్ద మనిషి ఆడుతున్న నాటకం అంటూ డైరెక్టుగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ కోణంలో పోలీసులు దృష్టి సారించి వాంగ్మూలం సేకరించడం తెలిసినదే. బిగ్ షాట్స్ నుంచి గంటల కొద్దీ దర్యాప్తులో పేజీల కొద్దీ వాంగ్మూలం తీసుకున్నారు.
తాజాగా మరో ట్విస్టు. సిఎన్ఎన్-న్యూస్ 18 వెబ్‌సైట్ కథనం ప్రకారం.. సుశాంత్ స్నేహితురాలు రియా చక్రవర్తి జూన్ 8న తన ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేసింది. సుశాంత్ – రియా మధ్య జూన్ 8 .. జూన్ 14 తేదీలలో సంభాషణలు లేవని కాల్ రికార్డులు సూచిస్తున్నాయి. సుశాంత్ తన బాంద్రా ఇంట్లో చనిపోయిన రోజు జూన్ 14.
ఈ మృతిని అనుమానాస్పద మృతిగానే భావిస్తూ కేసును సీబీఐకి బదిలీ చేశాక రకరకాల అంశాలపై దర్యాప్తు సాగుతోంది. ఈ కేసుపై సిబిఐ దర్యాప్తు కోసం బీహార్ ప్రభుత్వం చేసిన సిఫారసును అంగీకరించినట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇప్పుడు రియా ఫోన్ నంబర్ స్విచ్ఛాఫ్ చేయడం వెనక కారణమేమిటి? అన్నది సీబీఐ దర్యాప్తులో నిగ్గు తేలనుందా? అన్నది చూడాలి. ఇలాంటి కేసులో అపరాధానికి నిరపరాధానికి మధ్య సన్నని వెంట్రుక వాసి తేడా మాత్రమే ఉంటుంది. ఎవరు దోషి.. ఎవరు నిర్ధోషి అన్నది సీబీఐ తేల్చనుంది.