బాలీవుడ్ లో గత కొన్ని రోజుల నుంచి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం గురించే చర్చ. ఎందుకంటే.. ఎవ్వరూ ఊహించని విధంగా ఆయన మృతి కేసు ఎన్నో మలుపులు తిరుగుతోంది. ఎన్నో ట్విస్టులు రోజురోజుకూ వెలుగు చూస్తున్నాయి.
అంతా సుశాంత్ సింగ్ ది ఆత్మహత్య అనుకుంటే.. కాదు కాదు.. అది హత్యే అంటూ కొందరు ఆరోపణలు చేశారు. మరికొందరు సుశాంత్ ను కుక్క బెల్ట్ తో గొంతు నులిమి చంపేశారు అంటూ ఆరోపించారు. ఇంకొందరైతే.. సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తే.. సుశాంత్ ను చంపించింది అంటూ చెప్పుకొచ్చారు.
అసలు.. సుశాంత్ సింగ్ ది హత్యా? ఆత్మహత్యా? అనేది మాత్రం తేలడం లేదు. ఇటీవలే సుశాంత్ కేసును సుప్రీం కోర్టు సీబీఐకి అప్పగించింది. దీంతోనైనా సుశాంత్ మృతి వెనుక ఉన్న అసలు హంతకులు బయటికి వస్తారని సుశాంత్ ఫ్యాన్స్ భావిస్తున్న తరుణంలో మరో ట్విస్ట్ బయటికి వచ్చింది.
అదే మహేశ్ భట్, రియా చక్రవర్తి మధ్య జరిగిన వాటప్స్ చాట్. దీంతో కేసు మరో మలుపు తిరిగింది. సుశాంత్ చనిపోవడానికి ముందే.. వీళ్లిద్దరి మధ్య జరిగిన వాట్సప్ సంభాషణకు సంబంధించిన స్క్రీన్ షాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జూన్ 8న రియా, మహేశ్ భట్ ఇద్దరు వాట్సప్ లో చాట్ చేసుకున్నారు. ఆ తర్వాత జూన్ 14న సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే.. వాట్సప్ చాట్ ప్రకారం.. అప్పటికే రియా.. సుశాంత్ తో బ్రేక్ అప్ అయిందని అర్థం అవుతోంది.
సుశాంత్ తో బ్రేక్ అప్ అయినట్టుగా తన తండ్రికి రియా చెప్పిందని.. సుశాంత్ తో బ్రేకప్ కరెక్టేనని.. తన తండ్రి కూడా సంతోషిస్తాడని.. మహేశ్ భట్.. రియాకు సపోర్ట్ చేసినట్టుగా చాట్ లో ఉంది.
నిజానికి మహేశ్ భట్, రియా మధ్య బాండింగ్ ఇప్పటిది కాదు. మహేశ్ భట్ నిర్మాణంలో… రియా చక్రవర్తి జలేబి అనే సినిమాలో నటించింది. అప్పటి నుంచే వీళ్లిద్దరి మధ్య బాండింగ్ ఉందని తెలుస్తోంది. రియా ఫోన్ కాల్స్ ను ట్రేస్ చేసిన పోలీసులు.. ఈ మధ్య రియా.. మహేశ్ భట్ కు 18 సార్లు ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. దాంతో పాటు ఇప్పుడు చాట్ బయటపడటంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి.
ఇప్పటికే ఈడీ ఆఫీసర్లు రియాను ప్రశ్నించారు. సీబీఐ అధికారులు కూడా రియాను ప్రశ్నించే అవకాశం ఉంది. చూద్దాం.. మరి సుశాంత్ కేసు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో?