పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హీరోయిన్, క్యాస్టూమ్ డిజైనర్, డైరెక్టర్, రచయిత్రిగా రేణూ దేశాయ్‌లో ఎన్నో కోణాలున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయాక సోషల్ మీడియాల యాక్టివ్ అయింది. అప్పటి నుంచి తన భావాలను కవిత రూపంలో అభిమానులతో పంచుకుంటోంది. రేణూ దేశాయ్ రాసే లైన్స్, పోయెట్రీ కొత్తగా ఉండటమే కాక ఆలోచనలు రేకెత్తించేలా ఉంటాయి. తాజాగా ఆమె భావాలను మరోసారి సోషల్ మీడియాలో పంచుకుంది.
‘చాలా మంది దృష్టిలో నేను ఏంటంటే.. ఒంటరి మహిళను సింగిల్ పేరెంట్‌ని. గట్టిగా నవ్వే ఓ మహిళను. అందరిలాంటి ఆడదాన్ని కాదు. ఈ పురుష ప్రపంచంలో తన ఇష్టం వచ్చినట్టుగా బతికే స్త్రీని. అన్యాయాలను గట్టిగా ఎదిరించే ఓ మహిళను. భర్త సాయం లేకుండా పిల్లలను సరైన మార్గంలో పెంచే తల్లిని. లోలోపల చక్కగా ఉండే కృత్రిమ ప్రేమను నమ్మే స్త్రీని కాదు.
తనకంటూ కొన్ని అభిప్రాయాలున్నా మహిళని. తన కాళ్లపై తాను నిలబడి, వ్యాపారం చేసుకుని, ఆర్థికంగా బలపడగలిగే సామర్థ్యం ఉన్న మహిళని. సమాజంలోని పితృస్వామ్య వ్యవస్థకు అనుగుణంగా ఉండటానికి ఇష్టపడని స్త్రీని. పైన పేర్కొన్న అన్నిటికీ, అసమంజసమైన, క్రేజీ, కష్టతరమైన, మొండి పట్టుదలగల, మంచి జ్ఞాపకశక్తి, చెడ్డ, మిస్‌ఫిట్‌గా చెప్పుకోవచ్చు.
స్వతంత్ర ఆలోచన అనేది ఉండాలని నన్ను అనుసరించే యువతులందరికీ నేను చెప్పాలనుకుంటున్నాను. మీకంటూ ఓ ప్రత్యేక దృక్పథాన్ని కలిగి ఉండటం మంచిదే. ఎవరో కుమార్తె లేదా భార్యగా ఉండటం మీ గుర్తింపు కాదు. మీ జీవితానికి మీరే ప్రత్యేకం. సాంప్రదాయ విలువలను అగౌరవపర్చడం స్త్రీవాదం కాదు. కానీ కుటుంబ సంప్రదాయాల ముసుగులో శతాబ్దాలుగా జరుగుతున్న అన్యాయానికి అండగా నిలబడటమే స్త్రీ వాదం. మీ బలాలు, సామర్థ్యాలను నమ్మడం ప్రారంభించండి. దుర్గాదేవీ, లక్ష్మీ, సరస్వతిలా ఉండండి. మీ అందరికీ ఈ మూడు లక్షణాలను కలిగి ఉంటాయి. మీకు ఒక జీవితం ఉంది. దాన్ని అనుభవించండ’ని చెప్పుకొచ్చింది. ఇక రేణూ దేశాయ్ చేసిన పోస్ట్ ఎందరిలోనూ స్ఫూర్తినింపుతోంది.