మన స్టార్ హీరోలు ఏడాదికి ఒక సినిమానే చేస్తారు. వారి నుండి రెండో సినిమా వచ్చింది అంటే మిరాకిల్ అనే చెప్పుకోవాలి. ఒకే కథను పట్టుకుని ఏడాది పాటు డేట్లన్నీ దానికే కేటాయిస్తారు. ఒక సినిమాకియ రెండు సినిమాల రెమ్యునరేషన్ తీసుకుంటారు. సినిమా పూర్తైన వెంటనే కొన్ని నెలలు రెస్ట్ అంటారు. ఇంకొంతకాలం ప్రమోషన్ల హడావుడిలోనే గడిపేస్తారు. ఇలా ఒక సంవత్సరంలో వారు ఇవ్వగలిగేది ఒక్క సినిమానే. నిర్మాతలు మొత్తుకునేది ఇదే. రెండు సినిమాలు చెయ్యవచ్చు కదా అని. అప్పుడు రెమ్యునరేషన్ తగ్గుతుంది, నిర్మాతల మీద భారం, నిర్మాణ వ్యయాలు తగ్గుతాయి. కానీ అది జరగడం అంత సులభం కాదు. స్టార్ డైరెక్టర్లే ఒక్కోసారి హీరోలు దొరక్కా ఖాళీగా ఉండాల్సి వస్తోంది.
ఇదే పద్దతిని తన పట్టుదలతో ప్రశ్నిస్తున్నారు మెగాస్టార్ . మెగాస్టార్ చిరు అయ్యారంటే అందుకు కారణం ఆయన డేడికేషన్ అనే అనాలి. ఏడాదికి మూడు సినిమాలు ఖచ్చితంగా ఇచ్చేవారు. ఒకటి పూర్తయ్యేలోపు రెండు సినిమాలకు సైన్ చేసేవారు. ఒకేసారి రెండు సినిమాల చిత్రీకరణల్లో పాల్గొన్న సందర్భాలూ ఉన్నాయి. అప్పుడే కాదు ఇప్పుడూ ఆయనది అదే ఫార్మాట్. 65 ఏళ్ల వయసులో కూడ పాతికేళ్ల యువకుడిలా కష్టపడుతున్నారు. నిజానికి అంత కష్టం చేయాల్సిన అవసరం ఆయనకు లేదు. కానీ చేస్తున్నారంటే అది ఆయనలోని పోటీతత్వమే.
ప్రజెంట్ ‘ఆచార్య’ షూటింగ్లో ఉన్న ఆయన అది ముగిసిన వెంటనే ఇంకొక సినిమాను స్టార్ట్ చేస్తారు. ఏడాది చివరికల్లా దాన్ని కూడ ఫినిష్ చేసి ఇంకొక సినిమా స్టార్ట్ చేస్తారు. ఎలా లేదన్నా ఈ ఇయర్ ఆయన్నుండి రెండు సినిమాలు ఆశించవచ్చు. ఇవన్నీ కాకుండా రోజూ కొత్త కథలు వింటూ, గంటల తరబడి కథా చర్చలు చేస్తున్నారట. ఆన్ లొకేషన్లో క్యారవాన్ ఎక్కడం అనే మాటే లేదట. ఉంటె షాట్లోనా లేకపోతే స్క్రిప్ట్ ముందు వేసుకుని కూర్చోవడమా అంతే. మరి ఈ స్థాయి డెడికేషన్ అందరి స్టార్ హీరోలకు ఉంటే సంవత్సరంలో కనీసం 20 పెద్ద సినిమాలైనా వస్తాయి కదా.