రెజీనా… ఈసారి రియల్ పోలీసే!

కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘నక్షత్రం’లో రెజీనా కాసేపు ఖాకీ డ్ర‌స్‌లో కనిపించారు. ఏమాటకామాటే చెప్పుకోవాలి… పోలీస్ డ్ర‌స్‌ రెజీనాకు భలే సూటయ్యింది. అప్పట్లో రెజీనా పోలీస్‌గా నటించలేదని ఎవరైనా బాధపడితే వాళ్లకు ఓ శుభవార్త. త్వరలో సిల్వర్ స్క్రీన్ మీద పోలీస్‌గా కనిపించనున్నారు. నిజార్ షఫీ దర్శకత్వంలో రమేష్ వర్మ నిర్మిస్తున్న సినిమా ‘నిన్ను వదిలి నేను పోలేనులే’. ఇందులో హవీష్ హీరో. కళ్యాణ్ రామ్ ‘ఇజం’ ఫేమ్ అదితి ఆర్య, నిఖిల్ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’లో ఓ కథానాయికగా నటించిన నందితా శ్వేతా, అనీషా ఆంబ్రోస్ హీరోయిన్లు. ఈ సినిమాలో రెజీనా పోలీస్ క్యారెక్టర్ చేయనున్నారు. ఆమె ఫుల్ లెంగ్త్ పోలీస్ క్యారెక్టర్ చేయనుండటం ఇదే తొలిసారి. త్వరలో ఆమె షూటింగులో పాల్గొంటారని నిర్మాత రమేష్ వర్మ తెలిపారు.