రవితేజ ఓ టైమ్ లో సినిమా చేస్తే హిట్ ..సూపర్ హిట్ అన్న స్దాయిలో ఉండేది. గత కొంతకాలంగా సీన్ రివర్స్ అయ్యింది. హిట్ కాదు కదా మినిమం గ్యారెంటీ సినిమాలు కూడా చేయటం లేదు. ఆయన రీసెంట్ గా చేసిన `టచ్ చేసి చూడు`, `నేల టిక్కెట్` తో బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ తన సొంతం చేసుకున్నాడు. పసలేని కథలతో జనాల సహనాన్ని పరీక్షించాడంటూ మీడియా దుమ్మెత్తి పోసింది. ఈ నేపధ్యంలో ఇలా కాదు..ఓ
సేఫ్ కథని ఎంచుకోవాలి అనుకుంటూ ..తమిళంలో విజయ్ హీరోగా నటించిన `తేరి` సినిమా తెలుగులో రీమేక్ చేయటానికి సిద్దమయ్యాడు.
అయితే అప్పటికే తేరి సినిమాని `పోలీసోడు` టైటిల్ తో అనువాదం చేసి దిల్ రాజు రిలీజ్ చేస్తే ఫలితం లేదు. అయితే ఈ సినిమాకు నాదైన శైలిలో మార్పులు చేసానంటూ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ స్క్రిప్టు రెడీ చేసి రవితేజ చుట్టూ తిరగటంతో ..ఓకే అనేసాడు.
అయితే మీడియా మాత్రం అబ్బే రవితేజకు మరో ప్లాఫ్ వచ్చేసింది. అంటూ సినిమా ప్రారంభం కాకుండానే పబ్లిసిటీ మొదలెట్టేసారు. ఇంకో టైమ్ ..మరో టైమ్ లో అయితే రవితేజ ఛాలెంజ్ గా తీసుకుని …ప్రాజెక్టుని పట్టాలు ఎక్కించేవాడు. కానీ తన టైమ్ బాగోనప్పుడు రిస్క్ ఎందుకు అని మీడియా మాటలు తలకు ఎక్కించుకుని ప్రాజెక్టుని ఆపు చేసేసాడని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. మరి ఇంతవరకూ నిజముందో తెలియాలంటే కొంతకాలం ఆగాలి.