“అదిగో” ప్రీమియర్ షో టాక్ ,స్టోరీ లైన్

నటుడు, దర్శకుడు రవిబాబు దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ‘అదిగో’. అవును, అవును 2 , అనసూయ, అల్లరి లాంటి సినిమాలతో ప్రేక్షకులని అలరించిన రవి ఒక పంది పిల్ల కథాఅంశంగా అదిగో అనే సినిమా తెరకెక్కించటం అందిరినీ కాకపోయినా కొందరినైనా ఆశ్చర్యపరిచింది. పందిపిల్లతో సినిమా ఏంటి అని అనుకున్నారు. కానీ ఆదే ఈ సినిమా ఫ్రీ పబ్లిసిటీకు ప్లస్ అయ్యింది. జనాలంతో పందితో సినిమా అంట అని మాట్లాడుకునేలా చేసింది.

ఇక గత ఏడాదే విడుదలకి సన్నాహాలు చేసారు. కానీ అనివార్యకారణాల వలన ఆగిపోయింది. అయితే ఇప్పుడు దీపావళి కానుకగా విడుదలకి విడుదలకి సిద్ధం చేసారు.రవిబాబు, పందిపిల్ల ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా లైవ్ యాక్షన్ త్రీడీలో తెరకెక్కింది. తెలుగుతో భారతీయ అన్ని బాషలలో విడుదలకి సనహాలు చేస్తున్నారు.ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించింది. ఈ సినిమాపై రవిబాబు చాలా నమ్మకాలే పెట్టుకున్నారు. ఇప్పటికే అమెరికాలో షోలు పడ్డాయి. అక్కడ నుంచి వస్తున్న “అదిగో” టాక్ ..రివ్యూ వచ్చేలోగా చూద్దాం.

టాక్

అదిగో చిత్రం ..పబ్లిసిటీ చేసినంత గొప్పగా లేదు సరికదా చాలా చోట్ల బోరింగ్ గా ,విసిగించింది. ఓ నాలుగు క్రిమినిల్, మాఫియా గ్యాంగ్ లు పంది కోసం పరుగులు పెట్టడం..వినటానికి గొప్పగా అనిపించవచ్చేమో కానీ తెర మీదకు వచ్చేసరికి తేలిపోయింది. అలాగే ఆ గ్యాంగ్ లు ఈ పంది పిల్లను వెతకటానికి చూపిన కారణం కూడా చాలా సిల్లీగా అనిపిస్తుంది. ఇవన్నీ ఓ ఎత్తు అయితే అసలు పందిని పెంపుడు జంతువుగా పెంచుకుని, దాన్ని ముద్దు చేసేవారు మనకు మన దేశంలో కనపడవు. ఇతర దేశాల్లో ఆ కల్చర్ ఉంటుంది. అందుకే హాలీవుడ్ సినిమాలు పంది చుట్టూ అల్లుతూంటారు. మనకు ఈ పంది గోల ..ఎక్కటం కష్టమే.