అనసూయ భరద్వాజ్, రష్మి గౌతమ్ ఈటీవిలో ప్రసారమయ్యే జబర్ధస్త్ కామెడీ షోతో పాపులర్ అయ్యారు. అనసూయ జబర్థస్త్ కామెడీ షోతో ,రష్మి గౌతమ్ ఎక్స్‌ట్రా జబర్ధస్త్ కామెడీ షోతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ షోలు విజయవంతం కావటంలో వీరి పాత్ర చాలా ఉంది. అప్పటి వరకు ఎలా ఉన్నా జబర్దస్త్ అనే ఒకే ఒక్క షోతో స్టార్ యాంకర్స్ అయిపోయారు ఈ ముద్దుగుమ్మలు.ఆ క్రేజ్ తోనే ఇప్పుడు సినిమాల్లో కూడా నటిస్తున్నారు .జబర్దస్త్ పేరు చెప్పుకుని వరసగా సినిమాలు చేసేస్తున్నారు ఈ యాంకర్స్. లాక్ డౌన్ కారణంగా కొన్ని రోజులు వీళ్లు జబర్ధస్త్ ప్రోగ్రామ్‌కు దూరంగా ఉన్నారు. ఐతే.. లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో జబర్ధస్త్ ప్రోగ్రామ్ మళ్లీ పున: ప్రారంభం అయిన సంగతి తెలిసిందే.
అనసూయ భరద్వాజ్ నటనలో రష్మి కన్నా సీనియర్, ఎప్పుడో పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలుకు తల్లైన ఇప్పటికే వరుస షోలతో పాటు సినిమాలతో బిజీగా ఉంది. కానీ రష్మి గౌతమ్ మాత్రం ఇప్పటికీ సింగిల్‌గానే ఉంది. మ్యారేజ్ తర్వాత తన కెరీర్‌ను కంటిన్యూ చేయగలనా లేదా అని ఇన్ని రోజులు డైలామాలో ఉంది. కానీ సుమ, అనసూయ వంటి తోటి యాంకర్స్ పెళ్లి తర్వాత కూడా తమ కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. అలాగే రష్మి తాను కూడా మ్యారేజ్ చేసుకొని యాంకర్‌గా తన కెరీర్‌ను కొనసాగించాలనుకుంటున్నట్టు సమాచారం.తన మనసుని అర్ధంచేసుకుని తనని సంతోషంగా చూసుకునే వరుడు దొరికాడని వారిద్దరూ త్వరలోనే పెళ్లికి సిద్ధమవుతున్నారని సమాచారం . అయితే రష్మి నుండి అధికారకంగా ప్రకటన కోసం తన అభిమానులు ఉత్సహంతోను మరియు తమ కలల రాణికి మ్యారేజ్ అవ్వబోతుందేమో అని బాధతోను ఎదురు చూస్తున్నారు.