సూపర్ హిట్ స్దాయి టాక్..కానీ కలెక్షన్స్ మాత్రం

దగ్గుబాటి రానా సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన చిత్రం ‘కేరాఫ్ కంచరపాలెం’. విజయ ప్రవీణ పరుచూరి నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన  ఈ చిత్రంతో  వెంకటేష్ మహా అనే నూతన దర్శకుడు పరిచయం అయ్యారు. స్వీకర్‌ అగస్థి సంగీతం  అందించారు. ఈ నెల 7న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.విడుదలకు ముందే  న్యూయార్క్‌ చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు ఎంపికైన తొలి తెలుగు సినిమా కావడం,
ఇంకా రానా సమర్పిస్తుండటంతో.. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

వైజాగ్‌ దగ్గరలో ఉన్న కంచర‌పాలెం నేప‌థ్యంలో సాగే భిన్న‌మైన ప్రేమ‌క‌థగా  తెరకెక్కిన ఈ చిత్రం కలెక్షన్స్ …టాక్ కు తగ్గ స్దాయిలో లేవనేది ట్రేడ్
టాక్. ఫస్ట్ వీకెండ్ లో తప్పిస్తే…ఈ సినిమా కలెక్షన్స్ చెప్పుకోదని రీతిలో  లేవు. చాలా చోట్ల డ్రాప్ ఉంది. అయితే 75 లక్షల చిన్న బడ్జెట్ లో సినిమా తీయటం  కలిసొచ్చిన అంశం. పెళ్లి చూపులు సినిమాలాగ ..మెల్లి మెల్లిగా పెరిగి  కలెక్షన్స్ లో అద్బుతం జరిగే వాతావరణం అయితే లేదు. యావరేజ్ గ్రాసర్ గా ఈ సినిమా మిగిలిపోనుంది.

ఇప్పటికే ఈ చిత్రాన్ని చూసిన పలువురు సినీ ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా ప్రశంసించారు. ఎస్‌.ఎస్‌. రాజమౌళి, క్రిష్‌, మహేశ్‌బాబు, సుకుమార్‌, నాని, సమంత, రాశీఖన్నా తదితరులు యూనిట్‌ను మెచ్చుకున్నారు. సినిమాను తప్పక చూడండని ప్రేక్షకులను కోరారు.