రానా VS వెంకటేష్..ఊహించని లెవెల్లో “రానా నాయుడు” టీజర్.!

టాలీవుడ్ సినిమా దగ్గర ఉన్నటువంటి పలు ప్రముఖ సినీ ఫ్యామిలీ లలో అతి తక్కువ కాంట్రవర్సీ లు ఉండే ఫ్యామిలీ ఏదన్నా ఉంది అంటే అది దగ్గుబాటి వారి ఫ్యామిలీ అనే చెప్పాలి. వీరు అలాగే అక్కినేని కుటుంబం చాలా దూరంగానే పలు సంచలనాలకు దూరంగా ఉంటారు.

ఇక ఇప్పుడు టాలీవుడ్ లో నడుస్తున్న మల్టీ స్టారర్స్ లో అక్కినేని కుటుంబం నుంచి మంచి మల్టీ స్టారర్ సినిమాలు వస్తుండగా ఇప్పుడు దగ్గుబాటి కుటుంబం నుంచి ఓ ఊహించని లెవెల్ ట్రీట్ నే వస్తుంది అని చెప్పాలి.

దగ్గుబాటి రానా అలాగే సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేష్ లు ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫిక్స్ తో ఓ సాలిడ్ వెబ్ ఫిల్మ్ “రానా నాయుడు” చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సిరీస్ నుంచి మేకర్స్ ఓ టీజర్ ని అయితే రిలీజ్ చేశారు. ఇది మాత్రం ఊహించని రేంజ్ లో ఉందని చెప్పాలి.

అసలు రానా నుంచి పూర్తి కొత్త కోణం ఇందులో కనిపించగా వెంకటేష్ లుక్ అయితే ఆడియెన్స్ కి తప్పక షాక్ ఇస్తుంది. ఇక రానా నుంచి యాక్షన్ బ్లాక్, లిప్ లాక్ లు తన యాటిట్యూడ్ అంతా వేరే లెవెల్లో కనిపించడం రానా వర్సెస్ వెంకటేష్ ల మధ్య చూపించిన లాస్ట్ బిట్ ఈ క్రేజీ వెబ్ ప్రాజెక్ట్ పై ఓ రేంజ్ లో ఆసక్తి పెంచింది. దీనితో అయితే అభిమానులకి మాత్రమే కాకుండా జెనరల్ ఆడియెన్స్ కి కూడా భారీ ట్రీట్ ఇచ్చేలా కనిపిస్తుందని చెప్పాలి. 
Rana Naidu | Official Teaser | Rana Daggubati, Daggubati Venkatesh, Surveen Chawla | Netflix India