రాజ్ తరణ్ కు చీర,గాజులు వేయిస్తున్న రానా

వరస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న రానా దగ్గుపాటి తను సొంతంగా బ్యానర్ పెట్టి ఓ సినిమా నిర్మించనున్నారు.మరో యంగ్ హీరో రాజ్ తరుణ్ ఈ సినిమాలో నటించనున్నారు. ఈ మేరకు ఎగ్రిమెంట్స్ జరిగాయి. గతంలో రాజ్ తరుణ్ తో లవర్ చిత్రం డైరక్ట్ చేసిన అనీష్ కృష్ణ ఈ సినిమాని డైరక్ట్ చేయనున్నారు. అలాగే ఓ చిత్రం స్ట్రెయిట్ కథ కాదు. బాలీవుడ్ లో రిలీజ్ కు రెడీ గా ఉన్న ఓ చిత్రం. అదేమిటంటే..

బాలీవుడ్ లో క్రేజ్ ప్రాజెక్టు గా పేరు తెచ్చుకుని షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అవుతున్న చిత్రం డ్రీమ్ గర్ల్. ఈ చిత్రం కథని విన్న రానా వెంటనే తను తెలుగులో చేస్తానని లాక్ చేసారట. అందుకు తగిన హీరో రాజ్ తరుణ్ అని పిలిచి ప్రాజెక్టు అప్పచెప్పారు. పూర్తి ఫన్ తో సాగే ఈ చిత్రం లో హీరో రకరకాల లేడీ గెటప్స్ వేస్తారట.

అంధాధున్‌, బదాయి హో సినిమాల సక్సెస్‌లతో మంచి ఫాంలో ఉన్న బాలీవుడ్‌ యంగ్ హీరో ఆయుష్మాన్‌ ఖురానా ఈ డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. డ్రీమ్‌ గర్ల్‌ టైటిల్ తో తెరకెక్కన సినిమాలో ఆయుష్మాన్‌ టైటిల్‌ రోల్‌లో కనిపించనున్నాడు.

రాజ్‌ శాండిల్య దర్శకత్వంలో ఏక్తాకపూర్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. టీషర్ట్‌, చీర, చేతికి గాజులతో ఆయుష్మాన్‌ లుక్‌ ఫన్నీగా ఉంది. నుస్రత్ బారుచా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. మరి రాజ్ తరుణ్ కు కూడా అలాగే చీర, చేతికి గాజులు వేసి ఫస్ట్ లుక్ వదులుతారని అంతా భావిస్తున్నారు.

ఇక రాజ్ తరుణ్ విషయానికి వస్తే…గత కొంతకాలంగా రాజ్ తరుణ్ కు కెరీర్ పరంగా కలిసొచ్చిందేమీ లేదు. వరస ఫ్లాఫ్ లతో ఆయన దుసుకుపోయారు. ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మామ, కుమారి 21F తప్ప చెప్పుకోదగ్గ సినిమాలు పడలేదు. గత మూడు సంవత్సరాలుగా వచ్చి సినిమా వచ్చినట్లే వెనక్కి వెళ్లిపోతోంది. ఇప్పుడు దిల్ రాజు బ్యానర్ లో ఇద్దరి లోకం ఒక్కటే అనే చిత్రం చేస్తున్నారు.