వరుణ్ తేజ్ సినిమా లో నటించబోతున్న రమ్యకృష్ణ …

                                                                             (ధ్యాన్) 

ఫిదా, తొలి ప్రేమ చిత్రాల త‌ర్వాత మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌నయుడు, హీరో వ‌రుణ్ తేజ్ రెండు సినిమాల‌ను చేస్తున్నారు. అందులో ఒక‌టి దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్‌లో వెంక‌టేశ్‌తో చేస్తున్న మ‌ల్టీస్టార‌ర్ ఎఫ్ 2.. కాగా మ‌రో చిత్రం సంకల్ప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోయే స్పేస్ మూవీ. దీని త‌ర్వాత అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు ఫేమ్ సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో వ‌రుణ్ సినిమా చేయ‌బోతున్నాడు. ఈ యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను 14 రీల్స్ బ్యాన‌ర్ నిర్మించ‌నుంది. ఈ సినిమాకు నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఇందులో ర‌మ్య‌కృష్ణ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నార‌ట‌. సెకండ్ ఇన్నింగ్స్‌లో ర‌మ్య‌కృష్ణ ప‌వ‌ర్‌పుల్ పాత్ర‌ల‌తో ఆక‌ట్టుకుంటున్నారు.