మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన ‘వినయ విధేయ రామ’ ఈరోజే రిలీజయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉదయం 3 గంటల నుండే ప్రీమియర్ల రూపంలో సినిమా ప్రదర్శితమైన సంగతి తెలిసిందే. అన్ని ఏరియాల నుండి చిత్రానికి నెగిటివ్ టాక్ వస్తోంది. ముఖ్యంగా ఫస్టాఫ్ చాలా బాగుందని, బోయపాటి మార్క్ ఇంటర్వెల్ హైలెట్ అని సెకండాఫ్ హెవీ యాక్షన్ ఎపిసోడ్స్ తో నిండిపోయింది కానీ అవే చిత్రంగా ఉంటున్నాయి అంటున్నారు.
మరీ ముఖ్యంగా సెకండాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ లో విలన్ దగ్గరకు వేగంగా వెళ్లటం కోసం..హీరో పై నుంచి రన్నింగ్ ట్రైన్ పైకి దూకటం, విలన్ అనుచరుడు తలని హీరో కట్ చేస్తే…అది గాల్లోకు ఎగరటం..దాన్ని గద్ద ఎత్తుకు వెళ్లటం వంటివి నవ్వులాటగా మారాయంటున్నారు.
అలాగే సెకండాఫ్ పూర్తిగా యాక్షన్ బ్లాక్స్ తో నింపేయటం, సినిమాలో కథ ఏమీ లేకపోవటం తో తేలిపోయిందని తెలుస్తోంది. బోయపాటి శ్రీను కథ పైన దృష్టి పెట్టలేదని, కేవలం యాక్షన్ ఎపిసోడ్స్ తో సినిమాని నింపేసాడని అంటున్నారు.
అయితే రామ్ చరణ్ యాక్షన్ హారోగా సాలీడ్ బాడీతో కనపడటంతో ఫ్యాన్స్ కు పిచ్చ పిచ్చ గా నచ్చేస్తోంది. యాక్షన్ ఎపిసోడ్స్ కు ధియోటర్స్ లో మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే రంగస్థలం వంటి సినిమా తర్వాత చేయదగ్గ సినిమా కాదంటున్నారు. ఆ సినిమాలో గ్రామీణ యువకుడిగా మెప్పించిన రామ్ చరణ్..ఈ సినిమాలో ఔట్ అండ్ ఔట్ మాస్ క్యారెక్టర్‌లో అభిమానులను అలరించడానికి ప్రయత్నం చేసాడు కానీ సగమే సక్సెస్ అయ్యాడంటున్నారు.
ఇక మైనస్ డిగ్రీల ఉష్టోగ్రతలో చొక్కా విప్పి రామ్ చరణ్ చేసిన విన్యాసాలు ఈ సినిమాకే హైలెట్ అయ్యాయి. కైరా అద్వానీ గ్లామర్ ప్రదర్శనకు, పాటలకే పరిమితమైంది. విలన్‌గా వివేక్ ఓబరాయ్ నటన బాగున్నా, హీరోకు,విలన్ కు మధ్య పెద్దగా సీన్స్ లేకపోవటం దెబ్బ కొట్టిందని చెబుతున్నారు. క్లైమాక్స్ ఫైట్ మాస్ ప్రేక్షకులను అలరించేలా ఉందని వినికిడి. మొత్తానికి ఈ సంక్రాంతి బరిలో రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ ఎలాంటి రిజల్ట్ ఇవ్వబోతోందో మరికాసేట్లో పూర్తి రివ్యూతో అందిస్తాం.