సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి. మెగాస్టార్ తొలి స్వాతంత్ర్య సమరయోదుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో కనిపించనున్నారు. అంటే బ్రిటీష్ వారి కాలంలో కథ జరగనుంది. ఇప్పుడు రాజమౌళి చిత్రం #RRR కూడా ఆ కాలంలోనే జరగనుందని టాక్. ఈ విషయం బయిటకు ఎలా వచ్చిందీ అంటే.. ఈ కథనం చదవాల్సిందే.
టాలీవుడ్ మోస్ట్ క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ #RRR పై రోజుకో వార్త వస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ కలసి నటించనున్న మల్టీస్టారర్ లాంచింగ్‌కు డేట్ ఫిక్స్ చేసారు. సినిమా అనౌన్స్ అవ్వడమే ఆలస్యం అంచనాలు ఆకాశాన్ని అంటాయి. అలాగే రూమర్స్ రాజ్యం ఏలటం మొదలెట్టాయి. నిర్మాత డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని 200 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నాడని, తారక్, చరణ్ అన్నదమ్ములుగా నటిస్తున్నారని, వాళ్ళ పాత్రలు దొంగాపోలీసుల్లా ఉంటాయని,భాక్సర్స్ లా ఉంటారని, తారక్ విలన్ అని.. ఈ చిత్రంలో తెగ మాట్లాడేసుకుంటున్నారు. వీటిన్నటిని ప్రక్కన పెడితే.. తాజాగా ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికరమైన ఇన్ఫో దొరికింది.
వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం సెట్ ని హైదరాబాద్ అవుట్ స్కర్ట్స్ గండిపేటలో రాజమౌళి పర్యవేక్షణలో వేస్తున్నారు. మొదట అంతా రాజమౌళి తన సొంత కనస్ట్రక్షన్ చేస్తున్నారని భావించారు. అయితే అది సెట్ అని, అక్కడ వచ్చిన సినిమా ఆర్ట్ డిపార్టమెంట్ తో అర్దమైంది. ఇంతకీ ఆ నిర్మాణం ఏమిటి అంటే బ్రిటీష్ కాలం నాటి ఓ బిల్డింగ్, ఓ పల్లెటూరు. ఈ సెట్ ని చూసిన వారంతా ఈ కథ 1920 ప్రాంతంలో జరుగుతుందని, పీరియడ్ సినిమా అని తేల్చేసారు. పీరియడ్ సినిమా కాబట్టి దేశభక్తి మిళితమై ఉంటుందనటంలో సందేహం లేదు.
అలాగే సినిమాలో కీలకమైన ఇంటర్వెల్ సీన్‌ను రాజమౌళి మొదట ఇక్కడ తీయనున్నారట. ఈ సీన్ ని భారీగా డిజైన్ చేస్తున్నాడట. జనాలు చెప్పుకునేదాని ప్రకారం ఈ ఒక్క సీన్‌నే దాదాపు నెలా పదిహేను రోజుల పాటు తెరకెక్కించేందుకు ప్లాన్ చేసారు. ఈ ఎడిసోడ్‌లో ఊహిందని విధంగా ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది టాక్ . అంతేకాదు ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారట. వారిలో ఒకరు విదేశీ హీరోయిన్ అన్న వార్తలు కూడా ప్రచారంలోకి వచ్చాయి. మరి వార్తలపై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.