రాంచరణ్ అతిధిగా జులై 21న “హ్యాపి వెడ్డింగ్” ప్రీ రిలీజ్ ఈవెంట్ 

2018లో రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించి… మెగాస్టార్ చిరంజీవి తో  సైరా వంటి భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న మెగా పవర్ స్టార్ రాం చరణ్ ముఖ్య అతిథిగా హ్యాపి వెడ్డింగ్ గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ జరగనుంది. ఈ నెల 21 న జరగనున్న ఈ ఈవెంట్ ను గ్రాండ్ గా ప్లాన్ చేసింది చిత్ర యూనిట్. సుమంత్ అశ్విన్‌, నిహారిక జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక యువి క్రియేష‌న్స్ మ‌రియు పాకెట్ సినిమా సంయుక్తంగా నిర్మిస్తోంది. యంగ్ టాలెంటెడ్ ద‌ర్శ‌కుడు ల‌క్ష్మ‌ణ్ కార్య దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. శక్తికాంత్ మ్యూజిక్, ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్‌ రీ రీ రికార్డింగ్ అద్భుతంగా అందిస్తున్నారు. బాల్ రెడ్డి కెమెరా వర్క్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనుంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని జులై 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా

 

నిర్మాతలు మాట్లాడుతూ…. “పెళ్లి అనేది ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో జ‌రిగే విష‌య‌మే. అయితే పెళ్ళి కుదిరిన రోజు నుండి పెళ్ళి జ‌రిగేరోజు వ‌ర‌కు రెండు కుటుంబాల మధ్య, రెండు మ‌న‌సుల మ‌ధ్య ఏం జ‌రుగుతుంద‌నే విష‌యాన్ని చాలా అందంగా చూపించాం. ప్ర‌తి ఒక్క‌రి జీవితం లో ఇలాంటి అనుభ‌వం ఉంటుంది. ప్ర‌తి ప్రేక్ష‌కుడు త‌మ‌ని తాము చూసుకునేలా రూపొందిన చిత్రమిది. ట్రైలర్ విడుదలైన తర్వాత అన్ని వర్గాల నుంచి మంచి అప్లాజ్ వచ్చింది. ఈ నెల 21 న ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేశాం. ఈ ఈవెంట్ కు మెగా పవర్ స్టార్ రాంచరణ్ ముఖ్య అతిథిగా రానున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈ నెల 28 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం.“ అని అన్నారు..

 

న‌టీన‌టులు.. సుమంత్ అశ్విన్‌, నిహారిక, న‌రేష్, ముర‌ళి శ‌ర్మ‌, ప‌విత్ర లోకేష్, తుల‌సి, ఇంద్ర‌జ‌, మ‌ధుమ‌ణి త‌దిత‌రులు..

 

సాంకేతిక నిపుణులు..

 

యువి క్రియేష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో

మ్యూజిక్ డైరెక్టర్ – శక్తికాంత్

రీ రీ రికార్డింగ్ – ఎస్. ఎస్. తమన్

కెమెరా – బాల్ రెడ్డి

మ్యూజిక్ – శ‌క్తికాంత్ కార్తిక్‌

నిర్మాత‌ – పాకెట్ సినిమా

ద‌ర్శ‌క‌త్వం – ల‌క్ష్మ‌ణ్ కార్య‌