యూట్యూబ్ లో ట్రెండ్ సెట్ చేసిన ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ టీజర్.. !

Ramaraju For Bheem, junior ntr look revealed in RRR

ఎన్టీఆర్ , రామ్‌చరణ్ కాంబినేషన్ లో టాలీవుడ్ బిగెస్ట్ మల్టీస్టారర్ ‌గా దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి ఏ చిన్న అప్‌ డేట్ వచ్చినా దేశం మొత్తం ఆసక్తిగా చూస్తుంది . జక్కన్న నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై సౌత్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్‌లో కూడా భారీ అంచనాలున్నాయి.

ఈ క్రమంలోనే ఇప్పటికే విడుదల చేసిన రెండు టీజర్‌లు యూట్యూబ్‌లో విశేష ఆదరణ పొందాయి. దసరా సందర్భంగా విడుదల చేసిన ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ యూట్యూబ్‌‌లో సంచలనాలు క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ వీడియో మరో అరుదైన రికార్డు సాధించింది. అక్టోబర్ 22న విడుదలైన ఈ టీజర్ ఇప్పటివరకు 5 లక్షలకు పైగా కామెంట్లను దక్కించుకుంది.

ఇంత భారీస్థాయిలో కామెంట్లు దక్కించుకున్న తొలి తెలుగు టీజర్‌గా రికార్డు నెలకొల్పింది. ఇప్పటివరకు 3.5 కోట్లకు పైగా వ్యూస్ దక్కించుకోవడంతో పాటు 12 లక్షల లైకులు సాధించి తిరుగులేని రికార్డు తన ఖాతాలో వేసుకుంది. ఒక చిన్న టీజర్ ఇలాంటి రికార్డ్స్ సృష్టిస్తుంటే ..సినిమా విడుదల అయిన తర్వాత ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ అవుతాయో.