అప్పుడప్పుడు తప్పులు జరుగుతాయ్.. ఏం పర్లేదంటూ క్షమించేసిన రామ్

Ram Pothineni About Trolls On Big Ticket Issue In Pre Release Event

రామ్ RED ప్రీ రిలీజ్ ఈవెంట్ అంతా ఒకెత్తు. చివర్లో జరిగిన ఓ రచ్చ మరో ఎత్తు. త్రివిక్రమ్ స్పీచ్ అయిన తరువాత ఆయనకు మొదటి టిక్కెట్ ఇచ్చారు. అక్కడే పెద్ద పొరబాటు జరిగింది. ఆ టికెట్ RED సినిమాది కాదు. అది క్రాక్ సినిమా టికెట్. బిగ్ టికెట్ అంటూ అంత గ్రాండ్‌గా ఓపెన్ చేయించినప్పుడు అది కూడా క్లియర్‌గా చూసుకోరా అంటూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈవెంట్ అంతా బాగానే చేసి చివర్లో చెడ దొబ్బారంటూ శ్రేయాస్ మీడియాను ఏకిపారేస్తున్నారు.

Ram Pothineni About Trolls On Big Ticket Issue In Pre Release Event

మామూలుగా ఈవెంట్లను శ్రేయాస్ వారు గ్రాండ్‌గా, ఎలాంటి తప్పులు లేకుండా నిర్వహిస్తుంటారు. ఇలాంటి తప్పులు ఎప్పుడూ కూడా జరగలేదు. కానీ రామ్ సినిమా ఈవెంట్‌లో జరిగింది. దీంతో అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇక మిగతా నెటిజన్లు మాత్రం విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ ట్రోలింగ్, తప్పులు రామ్ చెవిన పడ్డట్టున్నాయి. తాజాగా రామ్ ఓ ట్వీట్ వేసి అంతా చల్లారిచే ప్రయత్నం చేశాడు.

RED ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఇంతలా గుర్తుండిపోయేలా చేసినందుకు త్రివిక్రమ్ ‌గారికి థ్యాంక్స్.. ఇంత ప్రేమను కురిపించిన నా డియరెస్ట్ ఫ్యాన్స్‌కు థ్యాంక్స్. ఇంతలా సపోర్ట్ చేసినందుకు మీడియా వారికి ధన్యవాదాలు.. అప్పుడప్పుడు తప్పులు జరుగుతాయ్.. ఏం పర్లేదు.. అయినా మీరు గ్రాండ్‌గా నిర్వహించారంటూ శ్రేయాస్ మీడియా వారిని రామ్ క్షమించి అభినందించేశాడు. ఇలా క్షమించి వదిలేయడంతో రామ్ అభిమానులు అతని గొప్పదనాన్ని చాటుతున్నారు.