ఇస్మార్ట్ శంకర్ ప్లాప్ ఆయ్యింటే రామ్ ఏమిచేసేవాడు?

ఊహించని విజయంతో హుషారుగావున్న హీరో రామ్ ఊరమాస్ ని వదలాలనుకోవడం లేదు. మరోసారి మాసంటే మాసే పరమ మాస్‌కే ఓటేసే యోచనలో ఉన్నాడట. ఇస్మార్ట్ కనుక అటో ఇటో అయితే తమిళ హిట్టు ‘తడమ్’తో తెరపైకి రావాలనుకున్నాడు. కాని ఆ అవసరం లేకుండా దర్శకుడు పూరి జగన్నాథ్ వీరకిక్కు నిచ్చాడు.

అందుకే .. మాస్ ప్రేక్షకులని మరోసారి మెప్పించాలని మనసులో ఫిక్సయ్యాడట రామ్. ఆలస్యమైనా అదోటైపు కథ వెతుక్కున్నాకే అధికారికంగా ప్రకటించొచ్చన్నది పరిశ్రమలో వినిపిస్తున్న మాట. ఆ దిశగానే నా తదుపరి చిత్రం ఉంటుంది అని చెప్పాడు.