రామ్ గోపాల్ వర్మ చేసే ట్వీట్లు, మాట్లాడే మాటలు ఊరికే అర్థం కావు. వర్మ వివాదాలపై కామెంట్ చేస్తాడో లేదా.. వివాదాలపైనే వర్మ కామెంట్ చేస్తాడో తెలీదు. నిత్యం ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉంటాడు. ఆ మధ్య సుశాంత్ కేసు, ఆత్మహత్యకు కారణం నెపోటిజం అంటూ రచ్చ జరుగుతున్న వేళ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ప్రతీ రంగంలో నెపోటిజం ఉంటుందని, అయితే కేవలం దాని వల్లే స్టార్స్ కారని, ప్రజలు ఒప్పుకుంటేనే స్టార్స్ అవుతారని వర్మ చెప్పుకొచ్చాడు.
ప్రతీ సారి నెపోటిజం అంటూ ప్రజలు విమర్శించడం తప్పని అన్నాడు. ఎవరిని హీరోగా పెట్టాలి పెట్టకూడదనేది దర్శక నిర్మాతల ఇష్టమని కాస్త ఘాటుగానే స్పందించాడు. ఇక తాజాగా సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే. సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రియా చక్రవర్తికి ఉచ్చు బిగిసింది. ఇలా వివాదం అటూ ఇటూ తిరిగి సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. చివరకు సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వీటిపై ఆర్జీవీ స్పందించాడు.
ఇంతవరకు ముంబై పోలీసులు చేయలేనిది.. ఒక్క రోజులో చేశారని వస్తోన్న కామెంట్లపై వర్మ స్పందించాడు. ఆర్జీవీ ట్వీట్ చేస్తూ.. ఒకవేళ సీబీఐ 24 గంటల పనితనం ముంబై పోలీసుల 68 రోజుల పనితనం ఒకటే అయితే రాబోవు 24 గంటల్లో సుశాంత్ కేసు పరిష్కరించబడుతుందన్న మాట.. వావ్ అంటూ సెటైర్ వేశాడు. మొత్తానికి ఆర్జీవీ సుశాంత్ కేసు, సీబీఐ విచారణపై బాగానే దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. కొంపదీసి సుశాంత్‌పైనా వర్మ సినిమా తీసేట్టు కనిపిస్తోన్నాడు.