అవన్నీ గుర్తు చేస్తూ పవన్ ని వెటకారం చేస్తున్న వర్మ

ఈ మధ్యకాలంలో వరస పెట్టి చంద్రబాబుని ఉద్దేశిస్తూ ట్వీట్స్ చేసింది, వెటకారాలు చేసింది రామ్ గోపాల్ వర్మ. తన సినమా ఆపారన్న కోపంతో ఆయన రెచ్చిపోయారు. అయితే ఆ కోపం కొద్దిగా చల్లారినట్లుంది. ఇప్పుడు ఆయన టార్గెట్ ని పవన్ వైపు తిప్పారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించి రామ్‌గోపాల్‌ వర్మ ట్విటర్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

జనసేనాని పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలను పేర్కొంటూ ఇవి ఎవరన్నారో తెలుసా? అని ఆయన పేరు ప్రస్తావించకుండా దెప్పిపొడుస్తూ ట్వీట్ చేసారు.

‘జగన్‌ నువ్వేలా సీఎం అవుతావో చూస్తా?, జగన్‌ చిన్న కోడికత్తికే గింజుకున్నారు, తెలంగాణలో ఆంధ్రులను కొడుతున్నారు, రాయలసీమ రౌడీలను గోదాట్లో కలిపేస్తా, నేను ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటే ఆపేదెవడు?, జగన్‌ అవిశ్వాసం పెడితే దేశం మొత్తం తిరిగి 50 మంది ఎంపీల మద్దతు కూడగడతా, 2 లక్షల పుస్తకాలు చదివా, 32 మార్కులతో 10 పాసయ్యా, ’ అంటూ పలు సందర్భాల్లో పవన్‌ చేసిన వ్యాఖ్యలను వర్మ ట్వీట్‌ చేశారు.

ఇక ఈ ట్వీట్‌కు చాలా మంది నెటిజన్లు స్పందిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు చేసింది జనసేనాని, మెగా పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణే అంటూ కామెంట్‌ చేస్తున్నారు.