బిగ్‌బాస్‌లోకి వెళతాను.. కానీ ఒక కండిషన్: RGV

rekha parvathaala a young author wrote a book on 'rgv'

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లాక్ డౌన్ లో బాగానే హడావుడి చేశాడు. కానీ ఈ మధ్య మళ్ళీ ఆయన హవా తగ్గిందని అనుకుంటున్న సమయంలో వరుస ఇంటర్వ్యూలో ఇస్తూ షాక్ ఇస్తున్నారు. రొటీన్ గా కాకుండా మరింత కొత్తగా మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఇక బోల్డ్ గా మాట్లాడటం అనేది ఆయనకు ముందు నుంచి ఉన్న అలవాటేనని స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

అయితే ఈ మధ్య ఆయన బిగ్ బాస్ షోపై కూడా కామెంట్స్ చేస్తుండడం వైరల్ అవుతోంది. ముఖ్యంగా యాంకర్ అరియానాను గెలిపించాలని అంటూ ప్రచారాలు కూడా చేస్తున్నాడు. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సీనియర్ డైరెక్టర్ బగ్ బాస్ లోకి అవకాశం వస్తే వెళతారా అనే ప్రశ్నకు చాలా డిఫరెంట్ గా ఆన్సర్ ఇచ్చారు. ఒక విధంగా కండిషన్ కూడా పెట్టారు. నిజానికి బిగ్ బాస్ అంటే నాకు ఇష్టం ఉండదు. కానీ ఒకసారి సన్నీలియోన్ హిందీ షోకు వెళ్లిందని చూడటం జరిగింది. అంతే తప్ప మరోసారి చూడలేదని చెప్పారు.

ఇక 16 మంది అమ్మాయిలతో కలిపి నన్ను ఒక్కడినే పంపిస్తే వెళతాను అంటూ ఆన్సర్ ఇచ్చాడు ఆర్జీవి. 16 మంది అమ్మాయిలు తప్ప మరో వ్యక్తి ఉండకూడదు. అప్పుడు 5000కెమెరాలు ఉన్నా కూడా నేను ఏ మాత్రం పట్టించుకోను. నైట్ విజన్ కెమెరాలున్నా కూడా కేర్ చేయను అంటూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ క్లారిటీగా వివరణ ఇవ్వడం ఆయన అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇక వర్మ తీసిన సినిమాల్లో నెక్స్ట్ కరోనా వైరస్ సినిమాను డైరెక్ట్ గా థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. మరి ఆ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.