ట్రెండీ టాక్: `ఆచార్య` గురువు `మ‌గ‌ధీర`‌

Ram Charan

మెగాస్టార్ చిరంజీవి- కొర‌టాల కాంబినేష‌న్ మూవీ ఆచార్య ప్ర‌స్తుతం హాట్ టాపిక్. దేవాదాయ శాఖలో స్కామ్ నేప‌థ్యంలో సోషియో పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్ సినిమాని తెర‌కెక్కిస్తుండ‌డంతో స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఎండోమెంట్ అధికారిగా క‌నిపించ‌నున్నార‌ని చెబుతున్నారు. అలాగే ఈ సినిమాలో మ‌హేష్ లేదా చ‌ర‌ణ్ న‌టించే వీలుంద‌ని ఇప్ప‌టికే ప్రచార‌మైంది.

ఫైన‌ల్ గా మ‌హేష్ కంటే చ‌ర‌ణ్ అయితేనే బెట‌ర్ అని చిరంజీవి స‌హా కొర‌టాల భావించార‌ని క‌థ‌నాలొచ్చాయి. అయితే చ‌ర‌ణ్ ఈ చిత్రంలో ఎలాంటి పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు? అంటే.. చిరు-చ‌ర‌ణ్ జోడీ రియ‌ల్ లైఫ్ లో లానే తెర‌పైనా తండ్రీ కొడుకులుగా న‌టించే వీలుంటుంద‌ని ప్ర‌చార‌మైంది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. డాడీ స‌న్ రోల్ కానే కాదు!! అని తెలుస్తోంది. ఇందులో చిరుకి గురువుగా చ‌ర‌ణ్ క‌నిపిస్తార‌ట‌. అంటే ఆచార్య‌కే దిశానిర్ధేశ‌నం చేసే గురూజీగా చ‌ర‌ణ్ న‌ట‌న ఆద్యంతం క‌ట్టిప‌డేస్తుంద‌ని చెబుతున్నారు. చాలా కీల‌క స‌మ‌యంలో ఆ పాత్ర మ‌ర‌ణిస్తుంది. అటుపై కార్య‌ద‌క్షుడైన శిష్యుడు గురువు త‌ల‌పెట్టిన బృహ‌త్త‌ర కార్యాన్ని పూర్తి చేశాడా లేదా? అన్న‌దే సినిమా. ఇక ఇందులో చ‌ర‌ణ్ కి ఓ రేంజులో న‌టించే స్కోప్ ఉన్న పాత్రను డిజైన్ చేశార‌ని చెబుతున్నారు. 30నిమిషాల పాటు స్క్రీన్ షేక్ అయిపోతుంద‌ట‌.

చిరు 152లో చ‌ర‌ణ్ న‌టించేందుకు ఎస్.ఎస్.రాజ‌మౌళి లైన్ క్లియ‌ర్ చేసేయ‌డంతో నెల‌రోజుల పాటు కొర‌టాల‌కు చ‌రణ్ కాల్షీట్ల‌ను ఇచ్చేశార‌ట‌. చిరు స‌ర‌స‌న కాజ‌ల్ క‌థానాయిక‌గా ఎంపికైంది. చ‌ర‌ణ్ నాయిక‌ను ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ – మ్యాట్నీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక మొత్తానికి ఆచార్య‌కే గుర‌వు అవుతున్నాడు మ‌గ‌ధీర‌!!