అజ‌ర్ బైజాన్‌కే చ‌ర‌ణ్ ఎందుకు వెళ్లాడంటే..!

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. డి.వి.వి.దాన‌య్య నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. అందులో భాగంగా అజ‌ర్‌బైజాన్‌లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇంత‌కు అజ‌ర్ బైజాన్‌లో ఏ స‌న్నివేశాల‌ను షూట్ చేస్తున్నారో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు. బీహార్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే యాక్ష‌న్ స‌న్నివేశాలు. అదేంటి?   బీహ‌ర్ బ్యాక్‌డ్రాప్‌లో స‌న్నివేశాల కోసం బీహార్‌కే వెళ్లొచ్చు క‌దా! అజ‌ర్‌బైజాన్ ఎందుకు అనుకోవ‌చ్చు. అజ‌ర్ బైజాన్‌లో చిత్రీక‌రిస్తే.. అక్క‌డే టూరింగ్ డెవ‌ల‌ప్ మెంట్ క్రింద చిత్రీక‌ర‌ణ‌లో 40 శాతం పైగా అమౌంట్ వెనక్కు వ‌చ్చేస్తుంద‌ట‌. మొత్తంగా చూస్తే బీహార్‌లో చిత్రీక‌రించే దాని కంటే త‌క్కువ మొత్తంలో చిత్రీక‌ర‌ణ పూర్త‌వుతుంద‌ట‌. అందుక‌నే చిత్ర యూనిట్ అజ‌ర్ బైజాన్‌లో షూటింగ్ ప్లాన్ చేసింది.