వైరల్ : తన ఫ్యాన్స్ కి పూర్తిగా కన్ఫ్యూజన్ లో పెట్టేసిన రామ్ చరణ్.!

Ram Charan Shankar

ఇప్పుడు పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ క్రేజ్ తెచ్చుకున్న మన తెలుగు స్టార్ హీరోస్ లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒకడు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ ఇండియన్ సినిమా మరో టాప్ మోస్ట్ దర్శకుడు అయినటువంటి శంకర్ తో తన కెరీర్ లో 15వ సినిమాని చేస్తున్నాడు.

మరి దీనిపై కూడా పాన్ ఇండియా లెవెల్లో భారీ స్థాయి అంచనాలు నెలకొనగా ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు హైదరాబాద్ లో 8వ షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకుంటుంది. అయితే ఈ చిత్రం విషయంలో మాత్రం రామ్ చరణ్ తన ఫ్యాన్స్ ని ఊహించని విధంగా కన్ఫ్యూజన్ లో పెట్టేస్తుండడం ఆసక్తిగా మారింది.

జస్ట్ కొన్నేసి రోజులు వ్యవధి లోనే ఓసారి గడ్డంతో ఇంకోసారి క్లీన్ షేవ్ అందులోని తక్కువ జుట్టుతో కనిపిస్తుండడం అభిమానులను ఒకింత షాక్ కి గురి చేస్తుంది. గత కొన్ని రోజులు కితమే గడ్డం లేకుండా కనిపించిన రామ్ చరణ్ నిన్న చిరు తాను లాల్ సింగ్ చడ్డా చూసిన తర్వాత అందరితో కలిసి పంచుకున్న ఓ వీడియోలో మళ్ళీ గడ్డం లో కనిపించడం ఆసక్తిగా మారింది.

అయితే ఇది నిన్న కాగా ఈరోజు తన జిమ్ వర్కౌట్ వీడియో రాగా ఇందులో మళ్ళీ గడ్డం లేదు దీనితో అసలు రామ్ చరణ్ ఏంటి ఇలా అని అంతా తన లుక్స్ పట్ల కన్ఫ్యూజ్ గా ఉన్నారు. ఇప్పుడు ఏదైనా లైవ్ లో చూస్తే తప్ప దీనిపై ఓ క్లారిటీ వచ్చేలా లేదని చెప్పాలి.