ఉప్పెన బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో టాలీవుడ్ మొత్తానికి భరోసా వచ్చేసింది. ఓ సినిమా బాగుందనే టాక్ వస్తే చాలు జనాలు ఆదరిస్తారనే నమ్మకాన్ని తెలుగు ప్రజలు ఇచ్చారు. ప్రస్తుతం ఉప్పెన సినిమా కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తోంది. నిన్న జరిగిన సక్సెస్ మీట్ కూడా గ్రాండ్‌గా హిట్ అయింది. ఆ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా వచ్చిన రామ్ చరణ్ ఇచ్చిన స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది. తన స్పీచ్‌లో అందరి గురించి మాట్లాడటంతో సంపూర్ణంగా అనిపించింది.
ఉప్పెన నిర్మాతలు, దేవీ శ్రీ ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ, కెమెరామెన్ శ్యాం దత్ ఇలా అందరి గురించి మాట్లాడాడు. ఒక డెబ్యూంటెంట్ మీద 30 40 కోట్లు పెట్టే నిర్మాతలు ఎవరైనా ఉన్నారంటే అదే కేవలం మైత్రి వారే. దేవీ శ్రీ ప్రసాద్ ఎప్పుడూ ఇచ్చిన బ్లాక్ బస్టర్ హిట్‌లే ఇస్తాడు.. నాక్కూడా ఆల్ టైం ఫేవరేట్ ఆల్బమ్ ఇచ్చాడు. అయితే మా వైష్ణుకి మొదటి సినిమాతోనే ఆ అదృష్టం వచ్చింది. విజయ్ సేతుపతి ఈ సినిమాలోకి రావడం మా వైష్ణు అదృష్టమో, బుచ్చిబాబు అదృష్టమో నాకు తెలియడం లేదు.
మొదటగా వైష్ణు హీరో అవుతానని చెప్పినప్పుడు ఇద్దరు బాగా ప్రోత్సహించారు. మొదటగా నాన్నగారికి చెబితే సరే అన్నారు. ఇక బాబాయ్ పవన్ కళ్యాణ్ గురువులా మారాడు. దేశవిదేశాలకు పంపి అన్నింట్లో ట్రైనింగ్ ఇచ్చాడు. అలాంటి వారు మా జీవితంలో ఉండటం.. మన జీవితంలో ఉండటం.. ఇలా ప్రోత్సహించడం మా అదృష్టం అంటూ రామ్ చరణ్ తన ప్రసంగాన్ని కొనసాగించాడు. అలా చిరంజీవి, పవన్ కళ్యాణ్ పేర్లు ప్రస్తావించడంతో ప్రాంగణం మొత్తం దద్దరిల్లిపోయింది.