ఆ పేపర్లో వార్తపై ఫైర్ అయిన రకుల్, క్లిప్పింగ్ తో ట్వీట్
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోన్న చిత్రం మన్మథుడు 2. రొమాంటిక్ ఎంటర్ టైనర్ రాబోతున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రకుల్ ప్రీత్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. సిగెరెట్ తాగటం విషయమై చేసిన కామెంట్ వైరల్ అయ్యింది. అయితే అదే విషయం మీడియాలో హైలెట్ చేయటం మాత్రం రకుల్ కు నచ్చలేదు. దాంతో ఆమె ఓ ఇంగ్లీష్ దిన పత్రిక పేపర్ క్లిప్పింగ్ ని జత చేస్తూ ట్వీట్ చేసింది.
I wonder why people miss out on writing key words from the interview. I DONT smoke or drink for that matter .It’s the character of Avantika that does! And it’s just a part of the role. We all know it’s injurious and #Manmandhudu2 is not promoting it in any way! pic.twitter.com/IyGlmajTvq
— Rakul Singh (@Rakulpreet) August 7, 2019
‘నేను ధూమపానం, మద్యపానం చేయను. కేవలం అవి అవంతిక(మన్మథుడు 2లో తన పాత్ర) అలవాట్లు! ఇది నటనలో భాగం. అవి రెండు ఆరోగ్యానికి హానికరం అని మనందరికీ తెలుసు. అటువంటి అలవాట్లను మన్మథుడు 2 ఏమాత్రం ప్రోత్సహించడం లేదు. నా ఇంటర్వ్యూలో ఉన్న అసలు విషయాన్ని వదిలేసి వేరే విషయాలు ఎందుకు రాస్తారో నాకు అస్సలు అర్థం కాదు’ అంటూ రకుల్ ప్రీత్ సింగ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
రకుల్ మాట్లాడుతూ…‘ సినిమాను సినిమాలా చూసే ఆలోచనా ధోరణి ప్రేక్షకుల్లో పెరిగింది. ‘మన్మథుడు 2’ సినిమాలో సిగరెట్ కాల్చింది నేను కాదు.. అవంతిక (ఈ సినిమాలో రకుల్ పాత్ర పేరు). సిగరెట్ కాల్చడం అవంతికకు ఉన్న అలవాటు. సినిమాలో కూడా ఇవి రెండు మూడు షాట్స్ మాత్రమే ఉంటాయి. నా నిజ జీవితంలో నేను సిగరెట్ కాల్చను. అయినా హీరోలు కాల్చితే ఏ ప్రాబ్లమూ ఉండదు. అదే సినిమాలో హీరోయిన్ సిగరెట్ కాల్చితే అదో పెద్ద టాపిక్. సినిమాలో ‘ధూమపానం ఆరోగ్యానికి హానికరం’ అనే క్యాషన్ కూడా వేస్తుంటాం కదా’’ అని పేర్కొన్నారు.
అదే విధంగా సినిమాలో తన క్యారెక్టర్‌కు సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలో…‘ సిగరెట్ కాల్చడం చాలా సాధారణ విషయం. మనం రోడ్డు మీద వెళ్తున్నపుడు కొంతమంది ఇలాంటి పనులు చేస్తే అస్సలు పట్టించుకోము. అదే తెరపై నటులు చేస్తే మాత్రం తప్పుగా చూస్తాం’ అని రకుల్ అన్నట్లుగా సదరు పత్రిక రాయడంతో ట్విటర్ వేదికగా ఆమె అసహనం వ్యక్తం చేశారు.