ప్రముఖ కన్నడ నటుడు, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబరీష్(66) మృతి చెందారు. అంబరీష్ మృతిపై సూపర్‌స్టార్ రజనీకాంత్ తన సంతాపాన్ని తెలియజేస్తూ ట్వీట్ చేసారు. రజనీతో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు అంబరీష్ మృతిపై తమ సంతాపాన్ని తెలియజేశారు.
A wonderful human being … my best friend … I have lost you today and will miss you … Rest In Peace #Ambrish
— Rajinikanth (@rajinikanth) November 24, 2018
‘‘ఓ గొప్ప మనిషి, నా ప్రాణ మిత్రుడిని ఈ రోజు కోల్పోయాను. నేను నిన్ను మిస్ అవుతా. అంబరీష్ నీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’’ అంటూ రజనీ ట్వీట్ చేశారు.
ఇక అల్లు అర్జున్ సైతం ట్వీట్ చేస్తూ…ఉదయమే ఈ వార్త షాకింగ్ కలిగించింది. ఆయన ది గోల్డెన్ సోల్. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా అన్నారు.
Kannada Star Ambareesh Garu No more . Shocking news early morning. Man with a golden soul . May his soul rest in peace . Condolences to @sumalathaA garu and the family. #Ambareesh garu .
— Allu Arjun (@alluarjun) November 25, 2018
అలాగే అంబరీష్ మృతి పట్ల తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు కృష్ణం రాజు. చిరకాల మిత్రుడు, కన్నడ రెబెల్ స్టార్ అంబరీష్ ఆకస్మిక మృతి తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. అంబరీష్ మరణం దక్షిణాది చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటని పేర్కొన్నారు. అంబరీష్ గొప్ప రాజకీయ నాయకుడిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని గుర్తుచేసుకున్నారు.
అంబరీష్ మృతిపై హీరోయిన్ రష్మిక మందన్న తన సంతాపాన్ని తెలియజేసింది. ‘‘దిగ్గజ నటుడు అంబరీష్ సార్ మృతి చెందారని తెలిసి చాలా బాధవేసింది. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా.. చాలా బాధగా ఉంది’’ అంటూ రష్మిక ట్వీట్ చేసింది.
Deeply saddened by the death of great legend #ambarish sir 😔
May your soul rst in peace sir 😔
Very sad to hear this…. pic.twitter.com/1qozpIvamE— Rashmika Mandanna (@iamRashmika) November 24, 2018
కాగా అంబరీష్ మృతి సమాచారం తెలుసుకున్న ప్రముఖ కన్నడ నటులు పునీత్ రాజ్‌కుమార్, దునియా విజయ్ తదితరులు ఆయనకు నివాళి అర్పించేందుకు ఆస్ప్రతికి చేరుకుంటున్నారు. మరికొందరు సోషల్‌మీడియా ద్వారా తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
గత కొంతకాలంగా కిడ్నీ, శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న అంబరీష్ గుండెపోటుతో బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అంబరీష్ ప్రముఖ సినీ నటి సుమలత భర్త.