రజనీ మరో సినిమాకు ఓకె చెప్పాడు, డైరక్టర్ ఎవరంటే…

ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్.. కార్తీక సుబ్బరాజు దర్శకత్వంలో `పేట్ట` లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్ తర్వాత సూపర్ స్టార్ మురగదాస్ సినిమాలో నటించనున్నారా? అంటే అవుననే బలమైన సంకేతాలు అందుతున్నాయి. ఆ మధ్యన ఓ ఇంటర్వ్యూలో మురగదాస్ ఆ ప్రాజెక్ట్ విషయమై ఇంట్రస్టింగ్ విషయాలు తెలిపారు.

సూపర్ స్టార్ తో సినిమా చేయడానికి సిద్దంగా ఉన్నా. ఇప్పటికే ఓ కథ కూడా వినిపించా. అది ఆయనకు బాగా నచ్చింది. ఒక వేళ ఆ కథ కాకపోతే మరో కథను ఆయన కోసం నెల రోజు ల సమయంలో సిద్దం చేస్తా. అయితే డేట్లు కుదరడమే కష్టం. ఇద్దరూ ఫుల్ బిజీగా ఉన్నాం. ఇద్దరికీ డేట్లు అందుబాటులో ఉన్నప్పుడు క చ్చితంగా సినిమా చేస్తామని ` తెలిపారు. ఇన్నాళ్లకు ఆ టైమ్ వచ్చిందని అర్దమవుతోంది. మురగదాస్ రీసెంట్ గా ఆయన్ని కలిసి ఓ కథ వినిపించి ఓకే చేయించుకున్నారని తెలుస్తోంది.

2.0 సినిమాతో సంచనాలు నమోదు చేస్తున్న సౌత్‌ సూపర్‌ స్టార్ రజనీకాంత్‌ ఇలా వరుస పెట్టి సినిమాలతో రెడీ అవుతున్నాడు. ఇప్పటికే కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో పేట్ట షూటింగ్ పూర్తి చేసిన రజనీ, మురగదాస్ సినిమాకు ఓకె చెప్పటంతో అభిమానుల ఆనందానికి అంతేలేదు. ఇది రజనీ 166వ చిత్రం అవనుంది.

విజయ్‌ హీరోగా సర్కార్‌ సినిమాతో కమర్షియల్‌ సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్న మురుగదాస్‌ తొలిసారిగా రజనీ హీరోగా సినిమాను తెరకెక్కించబోవటంతో చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై తమిళ చిత్ర పరిశ్రమతో పాటు దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. రజనీ, సామాజిక సమస్యల నేపథ్యంలో సినిమాలు చేసే మురుగదాస్‌ ని ఎంచుకోవటం వెనక రజనీ పొలిటికల్‌ ఎంట్రీకి ప్లస్‌ అవ్వాలనే ఆలోచన ఉందంటున్నారు విశ్లేషకులు‌.