రవితేజ దర్శకుడితో రజినీకాంత్ సినిమా

తలైవా రజినీకాంత్ ఈ వయసులోనూ ఒకదాని తరువాత ఒక సినిమా విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ప్రస్తుతం మురుగదాస్ తో ‘దర్బార్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ఆయన పోలీస్ వేషంలో ఉన్న స్టిల్స్ బయటకి వచ్చాయి.

దీనితో ఆయన పాత్ర పై సినిమా పై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. అది పక్కన పెడితే ఈ సినిమా పూర్తి కాగానే తమిళ దర్శకుడు శివతో సినిమా చేయనున్నాడు.

ఆయన తెలుగులో ‘సౌర్యం’, ‘శంఖం’ మరియు రవి తేజతో ‘దరువు’ సినిమాలు తీశారు. ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు మరి కొద్దీ రోజుల్లో వెల్లడి కానున్నాయి.