రాజమౌళి కోడలు కూడా కళారంగంలో ప్రావీణ్యురాలే !!

నిర్మాత దర్శకుడు వీబీ రాజేంద్రప్రసాద్ శ్రీమతి వసుంధరాదేవి దంపతులకు  ముగ్గురు కుమారులు రామ్ ప్రసాద్, కుమార్, జగపతి బాబు . రామ్ ప్రసాద్ పెద్ద కుమారుడు ఆయనకు హైద్రాబాద్ లో వాల్డెన్ సంస్థ వుంది . రామ్ ప్రసాద్ పెద్ద కుమార్తె నిత్యా ప్రసాద్ . బెంగుళూర్ కు చెందిన పారిశ్రామిక వేత్తతో మూడు సంవత్సరా క్రితం వివాహం అయ్యింది . రెండవ కుమార్తె పూజ ప్రసాద్. శాస్త్రీయ సంగీతంలో ప్రతిభావంతురాలు . నిత్యా పూజలు, పూజ కుసుమాలు లాంటి ఆల్బమ్ లను వెలువరించింది . తిరుపతి బ్రహ్మోత్సవాల్లో కూడా పాడింది .  కూడా ఈ అమ్మాయితో రాజమౌళి, శ్రీమతి రమ కుమారుడు కార్తికేయ నిశ్చితార్థం జరిగింది.

చాలాకాలంగా కార్తికేయతో పూజా ప్రసాద్ ప్రేమలో వుంది . కార్తికేయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా పూజా ప్రసాదే కొంత సమయం కావాలని అంటూ వచ్చింది . ఇప్పుడు పూజా  ప్రసాద్ వివాహానికి రెడీ అని చెప్పడంతో ఇరు కుటుంబాలు బుధవారం రాత్రి కలసి నిశ్చయ తాబూలాలు తీసుకున్నారు . ఈ వేడుకలకు రాజేంద్ర కుటుంబానికి చెందిన అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు .

ఈ విషయం స్వయంగా పూజా ప్రసాద్ తండ్రి రామ్ ప్రసాద్ తెలిపారు . “కార్తికేయ మంచివాడు , సినిమా రంగంలో తన ప్రతిభ నిరూపించుకున్నాడు , వేరే వ్యాపారాలు కూడా వున్నాయి . ఇక వారి కుటుంబానికి కూడా మంచి పేరు , గౌరవ మర్యాదలు వున్నాయి . అన్నింటికీ మించి మా పూజ కు నచ్చాడు” అని చెప్పాడు . త్వరలోనే ముహుర్తాలు పెట్టుకునే అవకాశం  వుంది.