రాజకుమారుడు కి 20 ఏళ్ళు !

కృష్ణ వార‌సుడిగా తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టిన మ‌హేష్ బాబు స‌క్సెస్‌ఫుల్‌గా 20 ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు. బాల‌న‌టుడిగా ఆరంగేట్రం చేసిన మ‌హేష్. హీరోగా న‌టించిన తొలి చిత్రం రాజుకుమారుడు. 1999 లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం మహేష్ బాబుకు కథానాయకుడిగా మొదటి సినిమా. ప్రీతి జింటా అతనికి జోడీగా నటించింది. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీ దత్ నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్నందించాడు. ఈ సినిమాకు అక్కినేని ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా నంది అవార్డు లభించింది. ఇది హిందీలోకి ప్రిన్స్ నంబర్ 1 పేరుతో అనువాదం అయింది. 20 ఏళ్ళ కెరీర్‌లో ఎన్నో వైవిధ్య‌మైన చిత్రాలు చేసిన మ‌హేష్ టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం టాప్ హీరోల‌లో ఒక‌రిగా ఉన్నాడు. మ‌హ‌ర్షి చిత్రంతో త‌న కెరీర్‌లో 25 సినిమాలు చేసిన మ‌హేష్ ప్ర‌స్తుతం అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో త‌న 26వ సినిమాగా స‌రిలేరు నీకెవ్వ‌రు అనే సినిమా చేస్తున్నారు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుద‌ల కానున్న‌ట్టు స‌మాచారం. ర‌ష్మిక మంధాన ఇందులో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. కెరీర్‌లో 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా మ‌హేష్‌కి సోష‌ల్ మీడియా ద్వారా శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి.