నటి శ్రీ రెడ్డి ఆరోపణలకు ప్రముఖ నృత్య దర్శకుడు రాఘవ లారెన్స్ స్పందించాడు.తన చారిటబుల్ ట్రస్ట్ నెలకొల్పి 13 ఏళ్ళు అవుతోందని,స్నేహితులు అభిమానుల మద్దతు ,ఆశీర్వాదం వల్ల ట్రస్ట్ వియవంతంగా నడుస్తోందని…అందుకు వారికీ కృతజ్ఞతలు అని ఆయన ట్విట్టర్ లో పెర్గోన్నారు.అదే ట్విట్టర్ లో శ్రీ రెడ్డి చేసిన ఆరోపణలను కందించారు తాను ఏ తప్పు చేయలేదని పెర్గోన్నారు . “శ్రీ రెడ్డి వివాదంలో స్పష్టమైన వివరణ కోరుతూ మీడియా నుంచి ఫోనులు వస్తున్నాయి.అందరికి స్పష్టత ఇవ్వాల్సిన సమయం వచ్చిందనుకుంటున్నాను.రెబెల్ సినిమా చేస్తున్నప్పుడు ఆమె నన్ను కలిశానని చెబుతున్నారు.ఆ సినిమా ఏడేళ్లు అయ్యింది.ఏడేళ్ల క్రితమే సమస్య గురించి ఆమె ఎందుకు ఫిర్యాదు చేయలేదు?సరే వదిలేయండి.ఆమె నా హోటల్ రూమ్ కి వచ్చినప్పుడు అసభ్యంగా ప్రవర్తించానని తెలిపింది.అంతే కాకుండా ..నా రూమ్ లో దేవుడి ఫోటో,రుద్రాక్ష మాల చూశానని పేర్గోండి.హోటల్స్ లో రుద్రాక్ష మాలతో పూజలు చేయడానికి నేనేమి మూర్ఖుణ్ణి కాదు.శ్రీరెడ్డికి డైరెక్ట్ గా చెబుతున్నా..నేను ఏ తప్పు చేయలేదు.నాకు ,భావంతుడుకిఆ విషయం తెలుసు.ఇంత చేసినా…ఆమెపై కోపం రావట్లేదు.ఆమె ఇంటర్వ్యూలన్నీ చూశా.ఆమెపై జాలేస్తుంది”అని రాఘవ లారెన్స్ పేర్కొన్నారు.శ్రీరెడ్డి సమస్యకు ఓ పరిష్కార మార్గాన్ని ఆయన సూచించారు.”నిజంగా శ్రీరెడ్డి సమస్య ఏంటి? అవకాశాలు ఇస్తామని ఆశచూపి అంతా ఆమెను మోసం చేశారనే చెపుతున్నారు కదా! తానొక మంచి నటి అని చెబుతోంది కదా! అయితే ఒక పని చేద్దాం ..నేనొక ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తా.’శ్రీరెడ్డి ..నువ్వు కూడా ప్రెస్ మీట్ కి రా.మీడియా ముందు నీకో క్యారెక్టర్ ,సీన్ ఇస్తా !నటించి చూపించు .అలాగే కొన్ని స్టెప్స్ చూపిస్తా.వేసి చూపించు .నేను కష్టమైన స్టెప్స్ ఇవ్వను.చాలా సింపుల్ స్టెప్స్ డైలాగ్ ఇస్తా! నటులకు ఉండాల్సిన బేసిక్ క్వాలిటీకి సంభదించినవి మాత్రమే’.తనలో నిజంగా ప్రతిభ ఉంటే,తాను ప్రతిభావంతురాలు అయితే …నా ముందు ,మీడియా ముందు చేసి చూపించాలి.నిజంగా తాను ‘బెస్ట్ యాక్టర్’ అని నేను ఫీలైతే దర్శకుడిగా నా తదుపరి సినిమాలో ఆమెకు ఓ మంచి అవకాశం ఇస్తా.అడ్వాన్స్ చేతిలో పెడతా” అని అయన తెలిపారు.తాను ఏ తప్పు చేయలేదని మరోసారి పేర్గొన్న రాఘవ లారెన్స్,శ్రీరెడ్డి ని నేరుగా ఎదుర్కొనడానికి భయపడి ఈ ప్రతిపాదన చేయలేదన్నారు.”శ్రీరెడ్డి నా సినిమాలో నటిస్తే ..ఆమెకు ఎక్కువ అవకాశాలు వస్తాయి.ఒకవేళ అందరి ముందు నటించడానికి ఇబ్బంది పడితే..నా మేనేజర్ కాంటాక్ట్ చేయమనండి. తన న్యాయవాది ,శ్రేయోభిలాషితో వచ్చి ప్రతిభ చూపించ వచ్చు.తప్పకుండ సహాయం చేస్తా .మహిళలను నేనెంతో గౌరవిస్తా.అందుకనే,నా తల్లికి గుడికట్టి మహిళలకు అంకితం ఇచ్చా.మంచి విషయాలు మాట్లాడుకుందాం.మంచి పనులు చేద్దాం.శ్రీరెడ్డికి మంచి జీవితం లభించాలని నేను పార్థిస్తాను”అని రాఘవ లారెన్స్ ముగించారు.అయన ఇలా ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఆ సవాల్ ని స్వీకరిస్తున్నట్లు శ్రీ రెడీ పేస్ బుక్ లో తెలిపారు.