ఎన్టీఆర్ బయోపిక్ లో రాశి ఖన్నా ?

స్టార్ డైరక్టర్ క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం‘ఎన్టీఆర్’. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ బయోపిక్ లో రాశి ఖన్నా కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రాశి ఖన్నా ఏ రోల్ లో నటిస్తోందో అని చిత్ర యూనిట్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఆ రోజుల్లో ఎన్టీఆర్ సరసన పలు చిత్రాల్లో నటించి మెప్పించిన జయప్రద పాత్రలో రాశి ఖన్నా నటించబోతున్నట్లు సమాచారం. మొదట ఈ పాత్రలో హన్సిక కనిపించబోతుంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు రాశి ఖన్నా అంటున్నారు.

‘అడవి రాముడు, యుగ పురుషుడు’ లాంటి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో ఎన్టీఆర్‌తో జయప్రద కలిసి నటించింది. థియోటర్స్ దద్దరిల్లేలా చిందులేసింది . ముఖ్యంగా వీరి కాంబోలో ‘‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి’’ లాంటి ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ వచ్చాయి. దీంతో ఈ పాట రీమిక్స్ ని తెరపై ఎక్సపెక్ట్ చేస్తున్నారు అభిమానులు.

కీరవాణి ఈ బయోపిక్ కి సంగీతం సమకూరుస్తున్నారు. కాగా జనవరి 9న ఈ చిత్రం మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ను విడుదల చేసి, జనవరి 24న రెండో పార్ట్ ‘మహానాయకుడు’ను విడుదల చేయనున్నారు. బుర్రా సాయిమాధవ్‌ మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి సాయి కొర్రపాటి, విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ఇప్పటికే శ్రీదేవిగా రకుల్ .. సావిత్రిగా నిత్యామీనన్ కి సంబంధించిన సన్నివేశాలను షూట్ చేసారు. ఇక జయసుధ పాత్ర కోసం పాయల్ రాజ్ పుత్ పేరు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే.