పుష్ప‌కు ట్యూన్ కుదిరింది..సెట్స్ కెళ్లెలోపు ఆప‌నైపోద్ది!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప అనే స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే అన్ని ప‌నులు పూర్తిచేసుకుని షూటింగ్ కి సిద్దంగా ఉంది. కానీ క‌రోనా కార‌ణంగా ప్రారంభించ‌లేదు. ప్ర‌భుత్వం షూటింగ్ ల‌కు అనుమ‌తిల‌చ్చినా హీరోలు బ‌‌య‌ప‌డి బ‌య‌ట‌కు రావ‌డం లేదు. ఇక లాక్ డౌన్ స‌మ‌యంలో పుష్ప‌కు సంబంధించిన మేజ‌ర్ ప‌నులు పూర్తిచేసిన‌ట్లు తెలుస్తోంది. సంగీత ద‌ర్శ‌కుడు దేవిశ్రీప్ర‌సాద్- సుకుమార్ క‌లిసి ఈ నాలుగు నెల‌ల్లో స్ర్కిప్ట్ కు త‌గ్గ స‌రైన ట్యూన్స్ లాక్ చేసారుట‌. ఈ విష‌యాన్ని దేవి శ్రీ రివీల్ చేసాడు. వీడియో క‌మ్యునికేష‌న్ యాప్ ల‌ను ఉప‌యోగించి వీరిద్ద‌రూ వ‌ర్చువ‌ల్ మ్యూజిక్ సెష‌న్లు నిర్వ‌హించి ట్యూన్స్ ఎంపిక పూర్తి చేసారుట‌.

ఇక పాట‌ల రికార్డింగ్ మొద‌లు పెట్ట‌డ‌మే ఆల‌స్య‌మంటున్నారు. షూటింగ్ ప్రారంభ‌మ‌య్యే లోపు పాట‌ల రికార్డింగ్ పనులు కూడా పూర్తిచేస్తామ‌ని ధీమా వ్య‌క్తం చేసారు. ఇందులో మొత్తం ఐదు పాట‌లుంటున్న‌ట్లు తెలిసింది. ప్ర‌తీ పాట ప్ర‌త్యేకంగా ఉంటుంద‌ని యూనిట్ తెలిపింది. దేవి శ్రీ-సుకుమార్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన ఆల్బ‌మ్స్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. మ్యూజిక‌ల్ గా  ఆ క‌ల‌యిక‌లో తెర‌కెక్కిన సినిమాలు మంచి స‌క్సెస్ అయ్యాయి. సుకుమార్ త‌న ప్ర‌తీ సినిమాకు దేవీనే సంగీత ద‌ర్శ‌కుడిగా కొన‌సాగిస్తుంటాడు. అత‌నంటే సుకుమార్ కు ప్ర‌త్యేక‌మైన న‌మ్మకం. త‌న కొత్త ప్ర‌య‌త్నాల‌న్నీ దేవితో ద‌గ్గ‌రుండి చేయిస్తుంటాడు. అందుకే ఆ కాంబినేష‌న్ అంటే మ్యూజిక్ ల‌వ‌ర్స్ లో  ప్ర‌త్యేక‌మై క్రేజ్.

ఇప్ప‌టికే విడుద‌లైన పుష్ప ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ కి మంచి రెస్పాన్స్ వ‌చ్చిన సంగ‌తి తెలి‌సిందే. ఊర మాస్ లో బ‌న్నీ లుక్ అదిరిపోయింది. ఇందులో బ‌న్నీ కి జోడీగా హాట్ బ్యూటీ ర‌ష్మిక మంద‌న న‌టిస్తుంది. ఇప్ప‌టికే విడుద‌లైన ర‌ష్మిక లుక్ కూడా ఆక‌ట్టుకుంది. గిరిజన యువ‌తి పాత్ర‌లో అమ్మ‌డు క‌నిపించ‌బోతుంది. ఇది చిత్తూరు అడ‌వుల్లో జ‌రిగే ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో సాగే చిత్రం. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ దాదాపు అడ‌వుల్లోనే ఎక్కువ‌గా ఉంటుంది. ఈ నేప‌థ్యంలో శేషాచ‌లం అడ‌వుల్లోనే చిత్రీక‌ర‌ణ చేయాల‌ని భావించారు. కానీ అట‌వీ అధికారులు అనుమ‌తి ఇవ్వ‌క‌పోవడంతో సెట్లు వేసి షూట్ చేయాల‌ని స‌న్నాహాలు చేస్తున్నారు. అయితే భారీ తారాగ‌ణం, ఆర్టిస్టులు షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం చెప్పిన వైర‌స్ సూచ‌న‌లు పాటించ‌డం ఇబ్బంది క‌రంగా మారే అవ‌కాశం ఉండ‌టంతో షూటింగ్ ప్రారంభిచ‌లేదు.