Pushpa Movie Song: ట్రెండింగ్ లో నిలిచి మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతున్న ‘శ్రీ వల్లి’

Pushpa Movie Song: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా మూవీ ” పుష్ప” సినిమా సూపర్ హిట్ అయిన సంగతి అందరికీ తెలిసిన విషయమే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆర్య ” ,” ఆర్య 2″ ‘పుష్ప‘ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను.. పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా మార్చేశారు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్. అల్లు అర్జున్ స్టైల్ ను, గ్లామర్ ని పక్కకు పెట్టి.. అతనిలోని టాలెంట్ ను బయటికి తీశారు సుక్కు. పుష్ప ది రైజ్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 17వ తేదీన విడుదలై.. బాక్సఫీసు దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. బాక్సాఫీస్ లో పాత రికార్డులను మొత్తం చెరిపేసి.. కొత్త రికార్డులను సృష్టించాడు పుష్పరాజ్. ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా మంచి వసూళ్లనే రాబట్టిన ఈ సినిమా.. కేరళతో పాటు.. బీ టౌన్ లోనూ భారీ వసూళ్లు రాబట్టింది.

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమాలోని ‘శ్రీ వల్లి’ ఫుల్ వీడియో సాంగ్ విడుదల అయ్యింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేశారు చిత్ర బృందం. విడుదల అయిన 24 గంటల లోపే 4 మిలియన్ల వ్యూస్ కి చేరువగా నిలిచి మ్యూజిక్ పరంగా 3 స్థానంలో ఉంది. ఇదే సినిమాలోని దాక్కో దాక్కో మేక 2వ స్థానంలో నిలవగా.. మొదటి స్థానంలో మెగా స్టార్ చిరంజీవి నటించిన ఆచార్య మూవీ లోని ‘సానా కష్టం’ సాంగ్ 11 మిలియన్ల వ్యూస్ తో మొదటి స్థానంలో నిలిచింది.

YouTube video player