వైరల్ : వేరే లెవెల్లో “పుష్ప” రీ రిలీజ్..టోటల్ మ్యాటర్ ఏమిటంటే.!

ఇప్పుడు తాజాగా మన టాలీవుడ్ లో ఓ కొత్త ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. ఆల్రెడీ రిలీజ్ అయ్యిన చిత్రాలను రీ మాస్టర్ చేసి మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. దీనితో ఆ సినిమాలకి భారీ ఆదరణ వస్తుంది. అయితే ఇది పక్కన పెడితే రీసెంట్ గా వచ్చే సినిమాలు కూడా ఒకదాని తర్వాత ఒకటి ముందు ఒక్క భాషలో రిలీజ్ అయ్యినా..

నెక్స్ట్ ఇతర భాషల్లో డబ్ అయ్యి రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇది బేసిక్ గా మన ఇండియన్ లాంగ్వేజస్ లోనే ఉంటుంది. ఏవో బాహుబలి లాంటి హిస్టారికల్ హిట్స్ తప్పా ఇలాంటి ఫీట్ అందుకున్నవి లేవు. కానీ మొదటిసారి ఇప్పుడు “పుష్ప” సినిమా సెన్సేషన్ ని నమోదు చేసింది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లాస్ట్ హిట్ సినిమా పుష్ప రీ రిలీజ్ అంటూ ఇప్పుడు సినీ వర్గాల్లో టాక్ పెద్ద ఎత్తున వైరల్ గా మారగా అసలు దీని వెనుక ఉన్న మ్యాటర్ ఏంటో తెలుస్తుంది. రీసెంట్ గా సుకుమార్ ఓ సినిమా ఈవెంట్ కి హాజరు కాగా అందులో “పుష్ప ది రైజ్” రీ రిలీజ్ పై బిగ్ అప్డేట్ అందించాడు.

ఈ చిత్రం రష్యన్ భాషలో ఇప్పుడు డబ్బింగ్ చేస్తున్నామని అక్కడ కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపాడు. దీనితో ఇప్పుడు ఈ మ్యాటర్ లీకయ్యి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. మరి ఈ సినిమాకి అక్కడ ఏ లెవెల్ డిమాండ్ వచ్చిందో కానీ ఈ రీ రిలీజ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.