ఇండియాలో దద్దరిల్లే రికార్డు నెలకొల్పిన “పుష్ప 1” మ్యూజిక్.!

మన తెలుగు సినిమా వద్ద ఉండే కొన్ని క్రేజీ కాంబినేషన్స్ లో దర్శకుడు హీరో అలాగే సంగీత దర్శకుడు కలిపి కొన్ని అదిరే కాంబోస్ ఉన్నాయి. అలాంటి కొన్ని ట్రెండ్ సెట్టింగ్ కాంబోస్ లో దర్శకుడు సుకుమార్ – హీరో అల్లు అర్జున్ – అలాగే సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ లా కాంబో కూడా ఒకటి.

అయితే ఈ కాంబోలో సినిమా అంటే సినిమా ఫలితం పక్కన పెట్టి ముందు పాటలు కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఆ రేంజ్ లో వీరు అదిరే ట్రెండ్ ని సెట్ చేసి పెట్టారు. అలా ఆర్య, ఆర్య 2 చిత్రాలు సెన్సేషన్ ని రేపగా మూడో సినిమా “పుష్ప” ని పాన్ ఇండియా లెవెల్లో అనౌన్స్ చెయ్యడంతో..

అసలు ఈ సినిమా మ్యూజిక్ ఏ లెవెల్లో ఉంటుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూసారు. మరి ఈ అంచనాలకి తగ్గట్టుగానే పాన్ ఇండియా లెవెల్లో ఆడియెన్స్ ని ఈ సినిమా సంగీతం ఊపేసింది. దీనితో ఇప్పుడు ఏకంగా దగ్గర ఏ సినిమా కూడా అందుకోని విధంగా దద్దరిల్లే రికార్డు ఈ చిత్రం ఆల్బమ్ అందుకుంది.

ఏకంగా 5 బిలియన్  వ్యూస్ ని ఈ సినిమా ఆల్బమ్ కొల్లగొట్టిందట. అంటే ఏకంగా 500 కోట్లు వ్యూస్ పుష్ప ఆల్బమ్ కి దక్కాయి. అసలు ఇది మామూలు విషయం కాదని చెప్పాలి. ఇక దీనికే ఇలా ఉంటే నెక్స్ట్ సినిమా ఆల్బమ్ ఎలా ఉంటుందో అని మరిన్ని అంచనాలు అంతా సెట్ చేసుకుంటున్నారు.