విజయ్ ని వూర మాస్ గా న ప్రెజెంట్ చేస్తున్న పూరి

విజయ్ దేవరకొండ కూడా ఇలాంటి ఓ డిఫరెంట్ పాత్రలో కనపడబోతున్నారట. పూరి దర్శకత్వంలో ఈ యువ కథానాయకుడు ఓ సినిమాను చేయబోతున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండను పూరి మాటలు సరిగ్గా పలకలేని వ్యక్తిగా చూపించబోతున్నారంటూ సమాచారం. అయితే విజయ్ దేవరకొండ తదుపరి సినిమా కోసం ఇప్పటికే ఇతర నిర్మాతలతో కమిటైయ్యారు.

దాని ప్రకారం వారిలో ఎవరో ఒకరితో ఈ సినిమాను చేయాలని ఈ హీరో అనుకుంటుండగా.. పూరి మాత్రం వేరే నిర్మాతలతో సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపడం లేదట. తన దర్శక నిర్మాణంలోనే సినిమా చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ విషయంపై చర్చలు జరుగుతున్నాయని టాక్.