గ‌ప్ చుప్‌: ప‌వ‌ర్ స్టార్ మూవీలో క‌రోనా!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ లో ఉత్సాహం పెంచిన సంగ‌తి తెలిసిందే. వ‌కీల్ సాబ్ (పీ.ఎస్.పీ.కే 26) .. పీ.ఎస్.పీ.కే 27 చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. క‌రోనా క‌ల్లోలం పెద్ద దెబ్బ కొట్టింది కానీ జెట్ స్పీడ్ తో ప‌రుగులు పెట్టించేందుకు ప‌వ‌న్ ఎంతో రిస్క్ చేసారు. ఇప్ప‌టికే వ‌కీల్ సాబ్ మెజారిటీ చిత్రీక‌ర‌ణ పూర్తి చేసిన ప‌వ‌న్ త‌దుప‌రి క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలోనూ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇది పూర్తిగా పీరియాడిక‌ల్ సినిమా. మొఘ‌ల్ సామ్రాజ్యం.. కోహినూర్ వ‌జ్రం దోపిడీ నేప‌థ్యంలో భారీ పాన్ ఇండియా చిత్ర‌మ‌ని చెబుతున్నారు. ఈ చిత్రానికి విరూపాక్ష అనే టైటిల్ ని ఎంపిక చేశార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది.

ఇక‌పోతే ఇందులో కీల‌క షెడ్యూల్ ని ఇదివ‌ర‌కూ తెర‌కెక్కించారు. స‌ముద్రాల‌పై కోహినూర్ ఎత్తుకెళుతుంటే బంధిపోటు అయిన ప‌వ‌న్ ఎదురు దాడికి దిగి దానిని దొంగిలించే భారీ యాక్ష‌న్ సీన్ ని తెర‌కెక్కించారు. ఇది రాబిన్ హుడ్ త‌ర‌హా పాత్ర అన్న ప్ర‌చారం సాగుతోంది. ఇక‌పోతే ఈ సినిమాలో మ‌రో ఇంట్రెస్టింగ్ స్పెష‌ల్ సాంగ్ కూడా ఉంటుంద‌ట‌. ఈ పాట‌ను కూడా ఇప్ప‌టికే చిత్రీక‌రించార‌ని తెలుస్తోంది. అంతేకాదు ఈ పాట‌లో ఎవ‌రు న‌ర్తించారు? అంటే.. తెలుగమ్మాయి.. రంగ‌స్థ‌లం ఫేం పూజిత పొన్నాడ‌ను ఈ స్పెష‌ల్ సాంగ్ కోసం ఎంపిక చేశార‌ట‌. పూజిత్ వైబ్రేంట్.. హాట్ లుక్ ఉన్న అమ్మాయి. ఆ క్ర‌మంలోనే ఈ ఆఫ‌ర్ ద‌క్కింద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ఆ స్పెష‌ల్ సాంగ్ ని చిత్రీక‌రించార‌ట‌. రామ్ చ‌ర‌ణ్ రంగ‌స్థ‌లం చిత్రంలో ఆది పినిశెట్టి స‌ర‌స‌న న‌టించిన పూజిత మంచి మార్కులే కొట్టేసింది. ఇప్పుడు మ‌రోసారి మెగా కాంపౌండ్ ఆఫ‌ర్ ద‌క్కించుకోవ‌డం అందునా ప‌వ‌ర్ స్టార్ లాంటి క్రేజీ హీరో సినిమాలో ఛాన్స్ ద‌క్కించుకోవ‌డంతో అది కాస్తా ఆస‌క్తి రేకెత్తిస్తోంది. ఇక ఈ చిత్రాన్ని ఏ.ఎం.ర‌త్నం అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు. కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. ప్ర‌స్తుతానికి లాక్ డౌన్ వ‌ల్ల షూటింగులు బంద్ అయిన సంగ‌తి విదిత‌మే