సెంటిమెంట్స్ పక్కన పెట్టి మరీ.. ఎన్టీఆర్-త్రివిక్రమ్ క్రేజీ అప్డేట్!!

Producer Naga Vamsi NTR 30 Title update

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అరవింద సమేతలో కొత్తగా, స్టైలీష్‌గా నటించి అదరగొట్టాడు. అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్ తరువాత త్రివిక్రమ్ కమ్ బ్యాక్ అదిరిపోయింది. అరవింద సమేతతో బాక్సాఫీస్ దుమ్ములేపాడు. అంతకు వరకు ఎన్టీఆర్‌ను చూపించిన తీరు.. త్రివిక్రమ్ చూపించిన తీరుకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అందుకే త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబోను మళ్లీ చూడాలని గట్టిగా కోరుకున్నారు.

Producer Naga Vamsi NTR 30 Title update
Producer Naga Vamsi NTR 30 Title update

మొత్తానికి ఫ్యాన్స్ కోరిక తీరింది. ఎన్టీఆర్ 30వ సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వం వహించబోతోన్నాడని, ఈ మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్, నందమూరి తారక రామారావు ఆర్ట్స్ కంబైన్డ్‌గా నిర్మించబోతోందని ఆ మధ్య అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్డేడ్ కావాలంటూ ఫ్యాన్స్ గత కొన్ని రోజులుగా రిక్వెస్ట్‌ చేస్తూనే ఉన్నారు. ఈ మేరకు నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చాడు.

Producer Naga Vamsi NTR 30 Title update
Producer Naga Vamsi NTR 30 Title update

‘యంగ్ టైగర్ ఫ్యాన్స్ అందరికీ ఓ విషయం చెప్పదలుచుకున్నాము. అప్డేట్ కావాలంటూ మీరు చేసే మెసేజ్‌లు మాకు అందుతూనే ఉన్నాయి. మామూలుగా అయితే మేము షూటింగ్ స్టార్ట్ చేసిన తరువాతే ఎలాంటి అప్డేట్ అయినా ఇస్తాము. షూటింగ్ ప్రారంభించకముందే టైటిల్ ప్రకటించలేము.. మాకు అది ఓ సెంటిమెంట్. అయితే ఈ సారి మాత్రం మీకోసం ఓ పెద్ద అప్డేట్ ఇవ్వబోతోన్నాం’ అని నాగవంశీ ప్రకటించాడు. అయితే ఈ సినిమా టైటిల్‌ను ‘అయినను పోయి రావలె హస్తినకు’ అని ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ విషయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతోన్నట్టు తెలుస్తోంది.