హాలీవుడ్ సిరీస్‌కు ప్రియాంక గుడ్‌బై

                                                                               (ధ్యాన్)

బాలీవుడ్ న‌టి ప్రియాంక చోప్రా.. అమెరిక‌న్ టెలివిజ‌న్ సిరీస్ క్వాంటికోలో అలెక్స్ పారిష్ అనే పాత్ర‌లో న‌టించి ఆక‌ట్టుకుంది. ఇందులో ప్రియాంక న‌ట‌ను పీపుల్ చాయిస్ అవార్డులు కూడా ద‌క్కాయి. హాలీవుడ్‌లో మంచి గుర్తింపు కూడా ద‌క్కింది. ఇప్పుడు క్వాంటికో సిరీస్ పూర్త‌యింది. అలెక్స్ పాత్ర శారీర‌కంగా, మాన‌సికంగా స‌వాలుతో కూడుకుంది. నాకు చాలా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఎన్నో మ‌ధుర అనుభూతుల‌ను ఇచ్చిన క్వాంటికో యూనిట్‌కి నా అభినంద‌లు` అంటూ ప్రియాంక సోష‌ల్ మీడియా ద్వారా క్వాంటికో సిరీస్ పూర్త‌యింద‌నే విష‌యాన్ని తెలియ‌జేస్తూ.. చిత్ర బృందంతో ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు.